Monday, December 23, 2024

గుజరాత్ కాంగ్రెస్ ఎమ్‌ఎల్‌ఎపై బిజెపి నేత దాడి… తీవ్ర ఉద్రిక్తత

- Advertisement -
- Advertisement -

BJP leader attacked Gujarat Congress MLA

నవ్‌సారీ (గుజరాత్): గుజరాత్ నవ్‌సారీ జిల్లా ఖేర్గాంలో ఖేర్గాంలో కాంగ్రెస్ ఎమ్‌ఎల్‌ఎ అనంత్ పటేల్‌పై బీజీపి నేత బాబు అహిర్, ఆయన మద్దతుదారులు దాడిచేశారని పోలీసులు ఆదివారం తెలిపారు. శనివారం సాయంత్రం జరిగిన ఈ సంఘటన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఎమ్‌ఎల్‌ఎ మద్దతుదారులు అనేక మంది ఖేర్గాంకు తరలివచ్చి అక్కడున్న దుకాణానికి నిప్పు పెట్టారు. మంటలార్పడానికి వచ్చిన ఫైర్‌ఇంజిన్‌ను కూడా తగుల బెట్టారు. ఈ సంఘటన కాంగ్రెస్, బీజేపీ మధ్య రాజకీయ దుమారం రేపింది. ఆదివారం ఉదయం దీనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు అయింది. స్థానిక బీజేపీ నేత , జిల్లా పంచాయతీ అధ్యక్షుడు బాబు అహిర్ , ఆయన మద్దతుదారులు తనపై దాడికి పాల్పడ్డారని ఎమ్‌ఎల్‌ఎ పటేల్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒక కార్యక్రమంలో పటేల్‌కు మద్దతుగా ఒక పాట పాడడమే ఈ దాడికి కారణంగా ఆరోపించారు.

ట్రాఫిక్ రద్దీగా ఉండడంతో ఖేర్గాంలో తాను కారును ఆపగా, నిందితులు కారు నుంచి బయటకు రమ్మని అల్లరి చేశారని, తాను తిరస్కరించగా, కారు అద్దాలు పగుల గొట్టి, డోరు తెరిచారని ఎమ్‌ఎల్‌ఎ ఆరోపించారు. నిందితులు తనపై అనేక సార్లు పిడిగుద్దులు గుద్దారని, దుర్భాషలాడారని పటేల్ ఆరోపించారు. పటేల్ కుడికంటి వద్ద గాయాలు తగిలాయి. గుజరాత్ అసెంబ్లీ విపక్ష నేత సుఖ్‌రామ్ రథ్వా, మాజీ రాష్ట్రకాంగ్రెస్ అధ్యక్షుడు అమిత్ ఛద్వా, పార్టీ ఎంఎల్‌ఎ చంద్రికా బారియా వన్‌స్డా లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పటేల్‌ను ఆదివారం పరామర్శించారు. ఈ సంఘటనకు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. బీజేపి పిరికిపంద చర్యగా విమర్శించారు. గుజరాత్ లోని పర్‌తాపినదీ అనుసంధాన ప్రాజెక్టుకు వ్యతిరేకంగా గిరిజన సమాజం తరఫున పోరాడుతున్న పటేల్‌పై దాడిని ఖండించవలసిందని పేర్కొన్నారు. గిరిజన హక్కుల సాధన కోసం ఆఖరి శ్వాస వరకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పోరాడాలని రాహుల్ పిలుపు నిచ్చారు. గుజరాత్ హోం సహాయ మంత్రి హర్ష్ సంఘ్వీ ఈ సంఘటనపై దర్యాప్తు ద్వారా సానుభూతి పొందడానికి ఇదో స్టంటుగా వ్యాఖ్యానించారు. దీనిపై దర్యాప్తు చేస్తామన్నారు. దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయకపోతే 14 జిల్లాల్లోని జాతీయ రహదార్లను దిగ్బంధం చేస్తామని ఎంఎల్‌ఎ అనంత్ పటేల్ హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News