Wednesday, January 22, 2025

సోనియా గాంధీ ‘విషకన్య’ : బసన్‌గౌడ పాటిల్ యత్నల్

- Advertisement -
- Advertisement -
సోనియా గాంధీ పాకిస్థాన్, చైనా ఏజెంట్‌లా పనిచేస్తూ దేశాన్ని నాశనం చేస్తోంది

కలబురగి: ప్రధాని నరేంద్ర మోడీని, ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ‘విష సర్పం’ అన్నాక ఇప్పుడు బిజెపి నాయకుడు, కేంద్ర మంత్రి బసన్‌గౌడ పాటిల్ యత్నల్ కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీని ‘విషకన్య’ అని వ్యాఖ్యానించారు. ఆయన బిజెపి అభ్యర్థి తరఫున గురువారం రాత్రి కొప్పల్‌కు చెందిన యలబుర్గలో ప్రచారం చేస్తూ ఈ విషయం చెప్పారు. ‘ప్రపంచ నాయకుడిగా ప్రజలే ప్రధాని మోడీని అంగీకరించారు. అలాంటప్పుడు కాంగ్రెస్ నాయకుడు ఆయనను విష సర్పం అని ఎలా అంటారు? సోనియా గాంధీ సన్నాయి నొక్కులే కాంగ్రెస్ నాయకులు అలాంటి ప్రకటనలు చేస్తున్నారు’ అని యత్నల్ అన్నారు.
సోనియా గాంధీ పాకిస్థాన్, చైనా ఏజెంట్‌లా వ్యవహరిస్తూ దేశాన్ని నాశనం చేస్తోంది’ అని ఆయన నిందించారు. ఓ ఛాయ్ అమ్ముకునే వ్యక్తి దేశానికి ప్రధాని అయినందుకు కాంగ్రెస్ మోడీని విమర్శిస్తోందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. వారు ఆయనపై అలాంటి పదజాలంతో దాడిచేయకూడదు అన్నారు.

Yatnal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News