పనాజీ: మాజీ రక్షణ మంత్రి, దివంగత మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్, బాబూష్‌గా పేరుగాంచిన బిజెపికి చెందిన అటానాసియా మోన్‌సెరట్ చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు. మోన్‌సెరట్ ఎన్‌డిటివితో మాట్లాడుతూ తాను గెలిచిన మార్జిన్‌తో సంతోషంగా లేనని, బిజెపి మద్దతుదారులు తనకు ఓటు వేయలేదని పేర్కొన్నారు. ‘ఈ విషయాన్ని బిజెపి నేతలకు చెప్పాను. భవిష్యత్తులో జాగ్రత్త వహించాలని, రాష్ట్ర బిజెపి యూనిట్ ప్రజలకు సరైన సందేశం ఇవ్వలేదు, బిజెపి నేతలందరితో టచ్‌లో ఉన్నాను, అంతేకాక బిజెపిలోనే ఉన్నాను’ అని తెలిపారు.
పనాజీ మంత్రి మాన్‌సెరేట్‌ను బిజెపి పోటికి దింపిన తర్వాత ఉత్పల్ పారికర్ స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికలలో పోటీ చేశారు. ఇంజనీరు అయిన ఉత్పల్ పారికర్ తన రాజకీయ జీవితాన్ని పనాజీలో బిజెపి అభ్యర్థికి వ్యతిరేకంగా పోరాడుతున్నట్లు చెప్పారు. ప్రత్యేకించి తన తండ్రి గోవాలో, ముఖ్యంగా పనాజీ నియోజకవర్గంలో తన తండ్రి పార్టీని కింది స్థాయి నుంచి నిర్మించారని అన్నారు.
గోవాలో మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన మనోహర్ పారికర్ 25 ఏళ్ల పాటు పనాజీ సీటును నిర్వహించారు. 2019లో ఆయన మరణానంతరం జరిగిన ఉప ఎన్నికల్లో రేప్ కేసులో నిందితుడిగా ఉన్న ఆయన చిరకాల ప్రత్యర్థి మాన్‌సెరేట్ కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. కానీ తర్వాత ఆయన బిజెపికి మారారు.
శివసేన, ఆమ్ ఆద్మీ పార్టీ పారికర్‌కు బహిరంగంగా మద్దతునిచ్చాయి. శివసేనకు చెందిన సంజయ్ రౌత్ తన తండ్రికి నివాళిగా ఉత్పల్ పారికర్‌పై అభ్యర్థిని నిలబెట్టవద్దని బిజెపియేతర పార్టీలకు విజ్ఞప్తి చేశారు. ఇదిలావుండగా 40 స్థానాలకుగాను 19 స్థానాల్లో బిజెపి ఆధిక్యంతో విజయం దిశలో వెళుతోంది. మెజారిటీ మార్కు 21కి కేవలం తక్కువ దూరంలో ఉంది. స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచిన ముగ్గురు బిజెపికి మద్దతునిస్తున్నారని ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తెలిపారు.
మనోహర్ పారికర్ కుమారుడిని ఓడించిన బిజెపి నాయకుడు మోన్‌సెరట్ !
- Advertisement -
- Advertisement -
- Advertisement -