Monday, January 20, 2025

పాట్నాలో బిజెపి పోలీసు ఢీ..

- Advertisement -
- Advertisement -

పాట్నా : బీహార్ రాజధాని పాట్నాలో గురువారం బిజెపి తలపెట్టిన చలో అసెంబ్లీ తీవ్రస్థాయి ఉద్రిక్తతకు దారితీసింది. పెద్ద ఎత్తున బిజెపి కార్యకర్తలు, నేతలు అసెంబ్లీ వైపు దూసుకువెళ్లుతుండగా వారిని నివారించేందుకు పోలీసులు జరిపిన లాఠీచార్జిలో తీవ్రంగా గాయపడ్డ బిజెపి నేత విజయ్ సింగ్ తరువాత మృతి చెందారు. నితీశ్ కుమార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బిజెపి ప్రదర్శన తలపెట్టింది. ఇది ఉద్రిక్తంగా మారింది. పోలీసుల జులుంతో అదేపనిగా జరిపిన లాఠీల ప్రయోగంతో జెహ్నాబాద్ జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి విజయ్ సింగ్ మృతి చెందారని పార్టీ సీనియర్ నేతలు పాట్నాలో తెలిపారు.

రాష్ట్రంలోని అవినీతి , అరాచకాల ప్రభుత్వానికి వ్యతిరేకంగా బిజెపి చేపట్టిన సత్యాగ్రహాన్ని పోలీసు బలగాలు విచ్ఛిన్నం చేసేందుకు యత్నించాయని , ఈ క్రమంలో విజయ్‌సింగ్ బలిదానం చేశారని, పలువురు తీవ్రంగా గాయపడ్డారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, బిజెపి రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షులు నిత్యానంద్ రాయ్ విలేకరుల సమావేశంలో తెలిపారు. వేలాది మంది బిజెపి కార్యకర్తలు గాయపడ్డారని, వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. పలు కుంభకోణాలలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి తేజీస్వీ యాదవ్

ప్రమేయం ఉందని, ఇటీవల పాత కేసుల్లో కూడా ఆయనపై ఛార్జీషీటు దాఖలు అయిందని, లాలూ అవినీతి కుటుంబం బీహార్‌ను దోచుకుందని, ఇకపై కూడా దోచుకునేందుకు సిద్ధమైందని కేంద్ర మంత్రి ఆరోపించారు. వీరి ఆగడాల నుంచి రాష్ట్రాన్ని విముక్తం చేసేందుకు బిజెపి కంకణం కుట్టుకుందని తెలిపారు. అయితే ఈ నేత మృతికి కారణాలు పూర్తిగా నిర్థారణ కాలేదని , గాయాలతో ఆయన ఆసుపత్రిలో చేరారని అయితే చికిత్స దశలో మృతి చెందారని, పోస్టుమార్టం నివేదిక తరువాతనే పూర్తి స్థాయిలో విషయం స్పష్టం కాదని పాట్నా మెడికల్ కాలేజీ, హాస్పిటల్ (పిఎంసిహెచ్) సూపరిండెంట్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News