Sunday, December 22, 2024

తెలంగాణలో బిజెపిని ఆపే శక్తి ఎవరికీ లేదు: డికె అరుణ

- Advertisement -
హైదరాబాద్: బిజెపి ఎదుగుదలని తట్టుకోలేక బిఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు కలిసి విష ప్రచారం చేస్తున్నాయని బిజెపి నాయకురాలు డికె అరుణ మండిపడ్డారు. శనివారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో బిజెపి బలపడుతుందని గ్రహించి కొన్ని పార్టీలు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఆధికారంలోకి వచ్చే అవకాశమే లేదన్నారు. కర్ణాటక ఎన్నికలకు, తెలంగాణకు అసలు సంబంధమే లేదని.. రాబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్స్ లో గెలిచి బిజెపి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బిజెపిని అధికారంలోకి రాకుండా ఆపే శక్తి ఎవరికీ లేదని, తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తేనే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు సాకారం అవుతాయని పేర్కొన్నారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News