Friday, January 10, 2025

అలా చేయడం కల్వకుంట్ల కుటుంబానికి అలవాటే: డాక్టర్ లక్ష్మణ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గతంలో బిఆర్‌ఎస్‌కు బిజెపి మద్దతిస్తుందని నేను చెప్పినట్లు మంత్రి కెటిఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె. లక్ష్మణ్ వెల్లడించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్పడం కల్వకుంట్ల కుటుంబానికి అలవాటే. దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటు. బిజెపి ఒక సిద్ధాంతానికి కట్టుబడి, ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా నడుచుకునే పార్టీ.

అంతేకాని, బిఆర్‌ఎస్ అవసరాల కోసం పక్కదారులు తొక్కే పార్టీ. ఎన్నికలొస్తే చాలు.. ఏదో ఒక పార్టీతో లాలూచీపడటం, కేవలం స్వార్థపూరిత రాజకీయాల కోసం పొత్తుల డ్రామాలతో ఓట్ల రాజకీయం చేయడమే వాళ్ల నైజం అని ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బిజెపికి పెరిగిన ఆదరణను జీర్ణించుకోలేక, సిపిఎం, సిపిఐ పార్టీలను కలుపుకొని ఎన్నికల్లో గెట్టెక్కేందుకు పొత్తు రాజకీయాలకు తెరతీసిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News