ఓటమి తర్వాత మాజీ బిజెపి ఎంఎల్ఏ ఈటల రాజేందర్ శనివారం మీడియా ముందుకు వచ్చారు. ప్రజలు బిజెపిని ఆధరించి గొప్పగా ఓటేశారన్నారు. బిజెపి 2018లో 6 శాతం, 2023లో 17 శాతం ఓట్లు సాధించిదని చెప్పారు. తెలంగాణలో రాబోయే రోజుల్లో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్ర బిజెపి కార్యలయంలో ఈటల రాజేందర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బిజెపి సీట్లు, ఓట్లు పెరిగాయని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాలు ఎన్నికల్లో బిజెపి మంచి విజయాలు సాధించిందన్నారు.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 400 ఎంపి స్థానాలను గెలుస్తామని జోస్యం చెప్పారు. గత ఎన్నికల్లో బిజెపికి 4 ఎంపి సీట్లు వచ్చాయి. రాష్ట్రంలోని అన్ని ఎంపి స్థానాలను బిజెపి గెలుస్తోందన్నారు. కరోనా సమయంలో ప్రధాని మోడీ దేశ ప్రజలకు భరోసా అందించారని తెలిపారు. కరోనా వ్యాక్సిన్ తీసుకొచ్చి ప్రజల ప్రాణాలు కాపాడారని చెప్పారు. ప్రధాని పదేళ్లలో దేశాన్ని ఎంతో అభివృద్ధి చేశారన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ 5వస్థానంలో ఉందని ఆయన పేర్కొన్నారు.