Monday, December 23, 2024

చండూరులో బిజెపికి షాక్

- Advertisement -
- Advertisement -

తిరిగి సొంతగూటికి చేరుకున్న దోనిపాముల సర్పంచ్

గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి జగదీష్ రెడ్డి

నల్లగొండ: మునుగోడు నియోజకవర్గంలో మరోసారి బిజెపికి చుక్కెదురైంది. టిఆర్ఎస్ ను కాదని బిజెపిలో చేరిన చండూరు మండలం దోనిపాముల సర్పంచ్ తిప్పర్తి దేవేందర్ తిరిగి సొంత గూటికి చేరారు. ఇప్పటికే కాంగ్రెస్, బిజెపిల నుంచి గులాబీ గూటికి వలసల జోరు కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా జరిగిన దోనిపాముల పరిణామం బిజెపికి మింగుడు పడకుండా చేసింది. ఈ మేరకు మంగళవారం ఉదయం హైదరాబాద్ లో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సమక్షంలో సర్పంచ్ దేవేందర్ తిరిగి మాతృసంస్థ టిఆర్ఎస్ పార్టీలో చేరారు. కాగా పార్టీలో చేరిన సర్పంచ్ దేవేందర్ కు మంత్రి జగదీష్ రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో చండూరు జడ్ పిటిసి కర్నాటి వెంకటేశం, ఎంపిటిసి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News