నిర్మల్: ఇంటింటికి బిజెపి గడప గడపకు మహేశన్న కార్యక్రమంలో భాగంగా నేడు నిర్మల్ నియోజకవర్గం లక్ష్మణచాంద మండలంలోని నర్సాపూర్ (డబ్లు), బాబాపూర్, కంజర్ గ్రామాల్లో శనివారం నిర్మల్ బిజెపి నేత, మాజీ ఎంఎల్ఎ ఏలేటి మహేశ్వర్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్బంగా గడప గడపకు తిరుగుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అమలు చేస్తున్నాటువంటి సంక్షేమ పథకాలను, అభివృద్దిని ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు . ఈ సందర్బంగా నిర్మల్ బిజెపి నేత, మాజీ ఎంఎల్ఎ ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రైతులకు, పేద ప్రజలకు , సబ్బండ వర్గాల ప్రజలకు అండగా ఉంటుందన్నారు. కరోనా సమయంలో వ్యాక్సిన్, ఉచిత రేషన్ బియ్యం, ఇలాంటి అనేక విషయాలను మోడీ ప్రవేశపెడుతున్నారని ప్రజలకు తెలిపారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ద్వారా దేశంలో 3 కోట్ల కు పైగా ఇళ్లను నిర్మించి,
అందులో తెలంగాణ రాష్ట్రానికి 2.5 లక్షల ఇళ్లను మంజూరు చేశారన్నారు. స్థానిక మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అవినీతిని అరికట్టాలని నిర్మల్‌లో బిజెపి జెండా ఎగారేయాలని, అందుకు ప్రతీ ఒకరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలోనే అన్ని వర్గాల ప్రజల అభివృద్ది సాధ్యం అవుతుందని మా ప్రభుత్వం రాగానే స్థానిక మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేసిన కబ్జా భూములను స్వాధీనం చేసుకొని అర్హులైన పేద ప్రజలకు వాటిని పంచుతామన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మండల అధ్యక్షులు గోవర్థన్ , అయ్యన్నగారి భూమయ్య, రావుల రాంనాథ్ , సామ రాజేశ్వర్ రెడ్డి, ముత్యం రెడ్డి, తక్కల రమణరెడ్డి, భూపతిరెడ్డి, విలాస్ , హరీష్ రెడ్డి, మార గంగారెడ్డి, సత్యం చంద్రకాంత్ , అలివెలు మంగ, జమాల్, తదితరులు పాల్గొన్నారు.