Saturday, January 11, 2025

కెసిఆర్‌కు వివాహ ఆహ్వాన పత్రికను అందించిన బిజేఎల్పీ నేత ఏలేటి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్‌: బిజెపి శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆదివారం మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫాం హౌస్‌కు వెళ్లి కలిశారు. తన కుమార్తె వివాహానికి హాజరు కావాలని కేసీఆర్‌ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు తన కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. పెళ్లికి హాజరై వదూవరులను ఆశీర్వాధించాలని కేసీఆర్‌ను కోరారు. దీనిపై ఏలేటి మీడియాతో మాట్లాడుతూ మా కుమార్తె వివాహానికి ఆహ్వానించేందుకు మాత్రమే ఫామ్ హౌజ్ కు వచ్చానని, తమ మధ్య ఎలాంటి చర్చలు జరగలేదని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News