Monday, December 23, 2024

బిజెపి లీడర్‌ని చంపి… మర్మాంగాలను కోసేసి

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: బిజెపి లీడర్‌ను గొంతు నులిమి చంపడంతో పాటు అతడి ప్రైవేట్ పార్ట్స్ ను కట్ చేసిన సంఘటన కర్నాటక రాష్ట్రం కళబురాగి ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బిజెపి నేత మల్లిఖార్జున సిడిమ్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. ఓ షాపులో మల్లిఖార్జున చిన్న వ్యాపారం నడిపిస్తున్నాడు. తన తండ్రికి ఇంటికి రాకపోవడంతో స్థానిక పోలీసులకు అతడి పిల్లలు సమాచారం ఇచ్చారు. పోలీసులు షాపు దగ్గరకు వెళ్లి వెతకగా అతడి మృతదేహం షాపు వెనక భాగంలో కనిపించింది. దుండగులు గొంతు నులిమి చంపడంతో పాటు అతడి మర్మాంగాలను కోసేశారు. కుళబురాగి ఎస్‌పి ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాజకీయ కక్షలు, పాత కక్షల నేపథ్యంలో హత్యా చేశారా? లేక అతడికి వివాహేతరం సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News