Tuesday, January 21, 2025

టిఆర్‌ఎస్‌లో చేరిన బిజెపి నాయకుడు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు చెందిన బిజెపి సీనియర్ నాయకులు, మాజీ ఉద్యమకారుడు పైడి వెంకట్రాంరెడ్డి టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అధ్వర్యంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో వెంకట్రాంరెడ్డి హైదరబాద్‌లో ఆదివారం మంత్రి వేముల సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణకు కెసిఆర్ వల్లే అభివృద్ధి జరుగుతుందని, మోడీ విధానాలు, బిజెపి విధానాలు తెలంగాణకు ద్రోహం చేస్తున్నాయి తప్ప ఒరిగింది ఏమీలేదని ఆయన ఆరోపించారు. వెంకట్రాంరెడ్డితో పాటు చిట్టి గంగారం కురుమ సంఘం మండల అధ్యక్షుడు, జైపాల్ రెడ్డి, రవీందర్ రెడ్డి, చాకలి సాయిలు, శ్రీకాంత్ రెడ్డి, సంజీవరెడ్డిలు బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News