Wednesday, December 25, 2024

ఎన్నికల ముందు గుజరాత్ బీజేపీకి ఝలక్ … పార్టీ ప్రధాన కార్యదర్శి రాజీనామా

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్ : బీజేపీ నేత ప్రదీప్ సింగ్ వాఘేలా గుజరాత్ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని పార్టీ శనివారం వెల్లడించింది.  త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో ప్రదీప్‌సింగ్ పదవిని వదులు కోవడం గమనార్హం. మరికొన్ని రోజుల్లో అన్నీ సర్దుకుంటాయన్నారు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల ఆయన రాజీనామా చేసినట్టు ఆ రాష్ట్ర పార్టీ కార్యదర్శి రజినీభాయ్ పటేల్ తెలిపారు.

ప్రస్తుత పరిస్థితులు తనకు అనుకూలంగా లేవని , అందుకే పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నట్టు ఇటీవల వాఘేలా పేర్కొన్నారు. దక్షిణ గుజరాత్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్‌పై తిరుగుబాటు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. కొన్ని రోజుల క్రితమే ఆయన తన రాజీనామాను అందించారు. అయితే రాజీనామా చేయడానికి గల కారణాలను ఆయన వెల్లడించలేదు. 2016 ఆగస్తు 10 న ప్రదీప్ సింగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. గతం లోనూ బీజేపీ జనతా యువమోర్చాకు కూడా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News