Sunday, January 19, 2025

చత్తీస్గఢ్లో బిజెపి నేత దారుణ హత్య..

- Advertisement -
- Advertisement -

చత్తీస్గఢ్లో బిజెపి నేత దారుణ హత్యకు గురయ్యారు.రాజనందగావ్ జిల్లా సర్ఖెడా గ్రామంలో బిజెపి నేత బిర్జు తారామ్ ఇంట్లోకి వెళ్లి మావోయిస్టులు మూడు రౌండుల కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బిర్జు తారామ్ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.

అనతంరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా, చత్తీస్గఢ్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపద్యంలో మావోయిస్టులు ఈ దుశ్చర్యకు పాల్పడడంతో.. బిజెపి నేతలు భయాందోళనలకు గురవుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News