Monday, January 20, 2025

ఢిల్లీలో బిజెపి నేత కాల్చివేత

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీలో బిజెపి నేత సురేంద్ర మటియాలను ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. శుక్రవారం సాయంత్రం సురేంద్ర కార్యాలయం వద్ద ఆగంతకులు కాల్పులకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. మటియాల అతడి మేనల్లుడు చూస్తుండగా 7.30సమయంలో ఇద్దరు వ్యక్తులు ముసుగులు ధరించిన ఇద్దరు వ్యక్తులు ద్వారకలోని బిజెపి నేత కార్యాలయంలోకి ప్రవేశించారు. తొలుత సురేంద్ర మటియాలపై దాడి చేసిన వీరిద్దరూ అనంతరం సమీపం నుంచి కాల్పులు జరిపారు. కాల్పులు అనంతరం ఆ ప్రాంతం నుంచి వీరిద్దరూ బైక్‌పై పారిపోయినట్లు పోలీసులు తెలిపారు.

ఈ హత్యాకాండలో ముగ్గరు వ్యక్తులు పాల్గొన్నారు. ఇద్దరు కార్యాలయంలోకి ప్రవేశించి దాడిచేయగా ఒకరు మోటార్‌బైక్‌పై వేచి ఉన్నాడు. హత్యఅనంతరం ముగ్గురు వ్యక్తులు బైక్‌పై పరారయ్యారని వివరించారు. వ్యక్తిగత ప్రతీకారంతోనే ఈ హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కొంతమందితో మటియాలకు ఆస్తి వివాదం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హంతకులను పట్టుకునేందుకు ఐదు టీమ్‌లను ఏర్పాటు చేశామని, ముగ్గురు వ్యక్తులను గుర్తించేందుకు సిసిటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నట్లు డిసిపి ద్వారక హర్షవర్ధన్ తెలిపారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News