Monday, December 23, 2024

బిజెపి నేత శ్రీకాంత్ త్యాగి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

BJP Leader Shrikant Tyagi Arrested in Meerut

నొయిడా: మహిళను దూషించిన కేసులో పరారీలో ఉన్న స్వయం ప్రకటిత బీజేపీ నేత శ్రీకాంత్ త్యాగిని పోలీసులు మంగళవారం మీరట్‌లో అరెస్టు చేశారు. సిద్ధాపురి కాలనీలో తన సన్నిహిత మిత్రునితో కలసి దాక్కున్న త్యాగిని పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. ఈ కేసులో తప్పించుకు తిరుగుతున్న త్యాగి సోమవారం రాత్రి హరిద్వార్ మీదుగా షహరాన్‌పూర్ చేరుకున్నారు. అక్కడ నుంచి రిషికేష్ చేరుకుని మంగళవారం ఉదయం మీరట్ వచ్చారు. నొయిడా పోలీసులు, యూపీ ఎస్‌టీఎఫ్ సంయుక్త ఆపరేషన్ నిర్వహించి త్యాగి ఆచూకీ గుర్తించి అదుపు లోకి తీసుకోగలిగారు.

BJP Leader Shrikant Tyagi Arrested in Meerut

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News