Monday, December 23, 2024

రిసార్ట్ ఉద్యోగిని అదృశ్యం, హత్య కేసులో

- Advertisement -
- Advertisement -

BJP leader son arrested for killing receptionist

ఉత్తరాఖండ్ బిజెపి నేత కొడుకు అరెస్టు

హరిద్వార్ : ఉత్తరాఖండ్‌లో ఓ ఉద్యోగిని దారుణ హత్యకు సంబంధించి సీనియర్ బిజెపి నేత వినోద్ ఆర్య కుమారుడు పుల్కిత్ ఆర్యను పోలీసులు అరెస్టు చేశారు. హరిద్వార్ జిల్లాలోని రిషికేష్ వద్ద ఈ బిజెపి నేతకు ఓ రిసార్ట్ ఉంది. ఇందులో పౌరీ గర్వాల్‌కు చెందిన 19 ఏండ్ల యువతి ఉద్యోగం చేస్తూ ఉండగా హత్యకు గురైంది. తొలుత ఈ యువతి గల్లంతయిందని పోలీసులకు ఫిర్యాదు అందింది. అయితే తరువాత జరిగిన దర్యాప్తులో పుల్కిత్ ఆర్యనే రిసార్ట్ సిబ్బందికి చెందిన ఇద్దరు వ్యక్తుల సాయంతో ఆమెను హత్యచేసినట్లు ప్రాధమికంగా నిర్థారణ కావడంతో వీరిని , ఆర్యను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటివరకూ ఈ యువతి మృతదేహం కనుగొనలేదు. రిసార్ట్‌కు సమీపంలోని కాలువ వద్ద పెద్ద ఎత్తున గాలింపు జరుగుతోంది. నిందితుడు బిజెపి సీనియర్ నేత కావడంతో దర్యాప్తు ఆలస్యం అవుతోందని పెద్ద ఎత్తున విమర్శలు తలెత్తాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News