Sunday, December 22, 2024

గిరిజనుడిపై బిజెపి నేత మూత్ర విసర్జన

- Advertisement -
- Advertisement -

ఇండోర్ : అత్యంత అమానవీయమైన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. భారతీయ జనతా పార్టీకి చెందిన ఒక నాయకుడు ఒక గిరిజన వ్యక్తి మీద మూత్రం పోస్తూ పైశాచిక ఆనందాన్ని పొందాడు. సిద్ధి జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను నెటిజెన్లు షేర్ చేస్తూ సదరు వ్యక్తిపై బిజెపిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వీడియోను కాంగ్రెస్ అధికార ప్రతినిధి అబ్బాస్ హఫీజ్ తన ట్విటర్‌లో షేర్ చేస్తూ ‘ఆదివాసీల ప్రయోజనాల గురించి తప్పుడు మాటలు మాట్లాడే బిజెపి నాయకుడు ఓ గిరిజన నిరుపేదపై ఇలా విరుచుకుపడడం చాలా ఖండించాల్సిందే’ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్-లో ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను ట్యాగ్ చేస్తూ ‘ఇదేనా మీ గిరిజన ప్రేమ? ఈ జంగిల్ రాజ్‌ని ఏమని పిలుస్తారు? మీ నాయకుడిని ఎందుకు అరెస్టు చేయలేదు? నిందితుడి పేరు ప్రవేశ్ శుక్లా. బిజెపి ఎంఎల్‌ఎ కేదార్ నాథ్ శుక్లా నియోజకవర్గానికి చెందినవాడు. గిరిజన యువకులపై మూత్ర విసర్జన ఇలాంటి నిందితులు భాజపాకు చెందిన ప్రముఖ నేతలతో కలిసి తిరుగుతారు’ అని దుయ్యబట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News