Monday, January 20, 2025

వృద్ధుని మృతికి దారి తీసిన బిజెపి నేత దారుణం

- Advertisement -
- Advertisement -

BJP leader who led the death of old man is brutal

 

భోపాల్ : పేరు చెప్పనందుకు, ఆధార్ కార్డు చూపనందుకు 65 ఏళ్ల మతిస్థిమితం లేని వృద్ధుడ్ని దారుణంగా కొట్టడం, అదృశ్యమైన ఆ వృద్ధుడు శవమై కనిపించడం సంచలనం కలిగించింది. మధ్యప్రదేశ్ లోని నీముచ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. రత్లాంసర్సి గ్రామానికి చెందిన 65 ఏళ్ల భన్వర్‌లాల్ జైన్ ఈ నెల 15 న తన కుటుంబంతో కలిసి రాజస్థాన్ లోని చిత్తీర్ గఢ్‌లో పుణ్యక్షేత్రానికి వెళ్లాడు. తరువాత ఈనెల 18 నుంచి ఆయన కనిపించలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు జరుగుతుండగా శుక్రవారం మానస ప్రాంతంలో భన్వర్‌లాల్ జైన్ మృతదేహం కనిపించింది. భన్వర్‌లాల్‌ను తీవ్రంగా కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో వృద్ధుడ్ని మానస బీజేపీ మాజీ కార్పొరేటర్ భర్త దినేష్ కుష్వాహ దారుణంగా కొడుతున్న దృశ్యం బయటపడింది. నీపేరేమిటి ? మహమ్మద్ కదా ? ముస్లింవా… పేరు సరిగ్గా చెప్పు. నీ ఆధార్ కార్డు చూపించు… అని వృద్ధుడ్ని నిందితుడు కుష్వాహ ఒకవైపు ప్రశ్నిస్తూ మరోవైపు దారుణంగా ముఖంపైన, చెంపల పైన కొట్టడం కనిపించింది. దెబ్బలు భరించలేక డబ్బులు ఇస్తానంటూ ఆ వృద్ధుడు ప్రాదేయపడడం కూడా స్పష్టంగా కనిపించింది. ఈ వీడియో పోలీసుల దృష్టికి రావడంతో నిందితుడు కుష్వాహాపై హత్యానేరం కేసు నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News