Friday, January 10, 2025

నిప్పులపై నడిచిన బీజేపీ నేత

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్ : బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా ఒడిశా లోని పూరి జిల్లాలో మంగళవారం జరిగిన జాతరలో పాల్గొన్నారు. గ్రామదేవత దులన్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. జాతరలో భాగంగా పది మీటర్ల వరకు ఏర్పాటు చేసిన అగ్నిగుండంపై నడిచారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన ట్విటర్ వేదికగా పంచుకున్నారు. ప్రజల శ్రేయస్సు కోసం అమ్మవారిని ప్రార్థించినట్టు తెలిపారు. “ పూరీ జిల్లాలోని రెబాటి రామన్ గ్రామంలో జరిగిన ఝాము జాతరలో పాల్గొన్నాను.

Also read: పది రోజుల్లో పెళ్లి.. ఇంతలోనే..

నిప్పులపైనడిచి అమ్మవారిని పూజించాను. ప్రజలు సుఖసంతోషాలతో తులతూగాలని వారి శ్రేయస్సు కోసం అమ్మవారిని ప్రార్థించాను. అగ్నిగుండంపై నడిచి అమ్మవారి దీవెనలు పొందడం వల్ల పుణ్యం పొందాను” అని ఆయన ట్వీట్ చేశారు. ఝాము జాతరలో కోరికలు నెరవేరాలని దులన్‌ను ప్రసన్నం చేసుకోడానికి భక్తులు నిప్పుల మీద నడవడం ఇక్కడి సంప్రదాయం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News