Friday, December 20, 2024

బీజేపీ నేతలవి చౌకబారు రాజకీయాలు

- Advertisement -
- Advertisement -

కరీంనగర్ : రైల్వే ఓవర్ బ్రిడ్జ్ సాధించడానికి అప్పటి కరీంనగర్ ఎంపీగా పని చేసిన బోయినపల్లి వినోద్ కుమార్ ఘనతనే అని క రీంనగర్ మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. బుధవారం కరీంనగర్‌లో ఎర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గ త నాలుగు సంవత్సరాల కాలంలో కరీంనగర్ నియోజకవర్గం అభివృద్ధి అంటే ఎరగని బండి సంజ య్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ విషయంలో బీఆర్‌ఎస్ పార్టీ పై చేసిన అనుచిత వాక్యలను త్రీవంగ ఖండించారు.

బండి సంజయ్ ఏదైనా మా ట్లాడే ముందు పూర్తి అవగాహన పెం చుకొని మాట్లాడలని అన్నారు. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కావాలనే ఆలోచన ప్రయత్నం 2014 లో బోయినపల్లి వినోద్ కుమార్ ఎంపి గా గెలిచిన తర్వాత బీజం పడిందన్నారు. 10 వ నేల 2014 లో అప్పటి రైల్వే బోర్డు చైర్మన్ శ్రీ వాస్తవ్‌కు బ్రిడ్జ్ కోసం వినతి పత్రం అందించారని తెలిపారు. గత 60 ఏళ్ళ బీజేపి, కాంగ్రెస్ పాలనలో పెద్దపల్లి నుండి నిజామా బాద్ వరకు రైల్వే లైన్ నిర్మాణం చేయాలని ఏ ప్రభుత్వం ఆలోచన చేయలేదని మండి పడ్డారు.

బొగ్గు, సిమెంట్ తరలి వెల్లాలంటే పెద్దపల్లి నుంచి హైదరాబాద్ మీదుగా ముంబాయ్ తరలివెల్లే ప రిస్థితి ని దృష్టిలో పెట్టుకొని అప్పటి ఎంపీలు వినోద్ కుమార్, కల్వ కుంట్ల కవిత పెద్దపల్లి నుంచి నిజామాబాద్ వరకు రైల్వే మార్గం వే యించడం జరిగిందన్నారు. వినోద్ కుమార్, గంగుల కమలాక ర్ లు తన మేధాశక్తి తో ట్రాఫిక్ తో సంబం ధం లేకుండా ఆ ప్రాంతం పట్టణ లిమిట్స్ లో ఉంటే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వేయోచ్చన్న ఆలో చనతో తీగలగుట్టపల్లి ప్రాంతం అభివృద్ధి, ట్రాఫిక్ ఇబ్బం దుల కోసం, రై ల్వే ఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటు కోసం ఆ ప్రాంతాన్ని నగరపాలక సంస్థ లో విలీనం చేయడం జరిగిందన్నారు.

ఎన్ని సార్లు అప్పటి అసమ ర్థ ప్రభుత్వాలకు ఎన్ని సార్లు మొర పెట్టుకున్న కేవలం 5 బ్రిడ్జ్ లు సాంక్షన్ చేశారని తెలిపారు. అందులో కరీంనగర్ నగరం తీగలగుట్టపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అని స్పష్టం చేశారు. డీజీల్, పెట్రోల్ పై వసూలు చేసిన సెస్‌ఫండ్‌ను సెంట్రల్ రోడ్స్ స్కీమ్ కింద రోడ్ల నిర్మాణం కో సం వాడాలి, రోడ్ల నిర్మాణ నిబంధన సడ లించుకొని కేంద్ర రైల్వే శాఖ మా వద్ద నిధులు లేవని చెప్పడంతో సెంట్రల్ రోడ్డు ఫండ్ సే తుబందన్ కింద తీగలగుట్టప ల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ సాంక్షన్ అవడం జరిగిందన్నారు.

బ్రిడ్జ్ నిర్మాణం కోసం 126 కోట్ల నిధులతో సగం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉందన్నారు. కరీంనగర్ వచ్చే ట్రిపుల్ ఐటీ కర్ణాటక తరలిపోతే ఆపలేని దద్దమ్మ బండి సంజయ్ అని విమర్శించారు. కొత్త జిల్లాలు ఏర్పాటైతే ప్రతి జిల్లాకు సాంక్షన్ చేయాల్సిన నవోదయ విద్యాలయాలు ఏవని ప్రశ్నించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు 4 ప్రభుత్వ మెడికల్ కళాశాలు సాధించ డం జరిగిందని, ఒక్క మెడికల్ కళాశాలకు కేంద్రం నుంచి నిధులు తీసుకురాని ఎంపి జిల్లాలో ఉండ టం చాలా దురదృష్టకరమని అన్నారు.

బండి ని ప్రజలు నమ్మరని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీ గా వినోద్ కుమార్, ఎమ్మె ల్యే, మంత్రిగా గంగుల కమలాకర్ ను ప్రజలు గెలిపించడం ఖాయం అన్నారు. బిజెపి పార్టీకి బండి సంజయ్ కి ప్రజలు తగిన గుణ పాఠం చెబుతారనిజోష్యం చెప్పారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్, కార్పొరేటర్లు తోట రాములు, వాల రమణ రావు, ఐలేందర్ యాదవ్, గుగ్గిల్ల జయశ్రీ, బండారి వేణు, బోనాల శ్రీకాంత్, కంసాల శ్రీనివాస్, బీఆర్‌ఎస్ నాయ కులు నక్క కృష్ణ, ఎడ్ల అశోక్, కాశెట్టి శ్రీనివాస్, అర్ష మల్లేషం, గందె మహేష్, గుగ్గిల్ల శ్రీనివాస్, మేచినేణి అశోక్ రావు, లెక్కల వే ణు, కొలిపాక శ్రీనివాస్, కరీం, అనిల్, హామీద్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News