చట్టం జగన్ చుట్టమా: ప్రశ్నించిన బిజెపి
తిరుపతి: ప్రపంచ ప్రఖ్యాతి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిలో గత సంఖ్య ను మించి ఐదు పదుల పైన సభ్యులను కలుపుకుని దేవస్థాన కమిటీని నియమించడం పట్ల బిజెపి నేతలు భాను ప్రకాష్ రెడ్డి , సామంచి శ్రీనివాస్, అజయ్ కుమార్, వరప్రసాద్ లు గురువారం విమర్శలు గుప్పించారు. ప్రెస్ క్లబ్ లో సిఎం జగన్ పై బిజెపి నేతలు మండిపడ్డారు. సిఎం జగన్ మోహన్ రెడ్డి స్థానంలో ఉండి ఇలా శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించడం సరికాదని హితువు పలికారు. ముఖ్యమంత్రి పెట్టుకున్న చట్టాల్ని పులివెందులలో గుడి కట్టి అక్కడ పాలక మండలి సభ్యుల్ని ఇష్టారాజ్యంగా నియమించుకొని వ్యవహారించాలే గాని ఇలా టిటిడి గౌరవాన్ని మంట కలపడం సరి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నియామకంతో టిటిడిపై ఆర్థిక భారం మోపి రాజకీయ స్వలాభం చూసుకోవడం వైసిపికి మంచిది కాదని చురకలంటించారు.