Monday, December 23, 2024

వాసురెడ్డికి బిజెపి నేతల సంతాపం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : రామాయంపేట మాజీ శాసనసభ్యులు ఆర్.ఎస్.వాసు రెడ్డి మృతి పట్ల బిజెపి నేతలు సంతాపం వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం తర్వాత ఉమ్మడి మెదక్ జిల్లా నుండి ఎన్నికైన మొదటి బిజెపి ఎమ్మెల్యేగా పనిచేశారని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. 1984 నుంచి 85 వరకు ఎమ్మెల్యేగా పనిచేస్తున్న సమయంలో ప్రజా సమస్యలకోసం వాసు చేసిన కృషి చిరస్మరణీయం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యలకు నా ప్రగాఢ సానుభూతి అని ఆయన తెలిపారు. అదే విధంగా రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News