Friday, January 17, 2025

రాష్ట్రం కరవులో ఉంటే లగ్జరీ విమానాలు కావాలా?

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఆయన మంత్రివర్గ సభచరుడు బిజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్ ఒక ప్రైవేట్ విమానంలో ప్రయానిస్తున్నపుడు తీసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బిజెపి నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకుల విలాసవంతమైన పోకడలకు ఇదే నిదర్శనమంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆరోపణలకు ముఖ్యమంత్రి సిద్దరామయ్య కూడా దీటుగా సమాధానమిచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రయాణించే విమానాల గురించి ఆయన ప్రశ్నించారు. సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన ఒక వైరల్ వీడియోలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య, హౌసింగ్ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్, రెవెన్యూ మంత్రి కృష్ణ బైరె గౌడ మరికొందరు ఒక ప్రైవేట్ విమానంలో కూర్చుని ఉన్నారు.

మరో పోస్టులో మంత్రి కాన్ విమానంలో నడుస్తుండగా నేపథ్యంలో ఒక పాపులర్ బాలీవుడ్ పాట వినిపిస్తోంది. ఈ వీడియోలపై కర్నాటక బిజెపి అధ్యక్షుడు బివై విజయేంద్ర సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఘాటుగా స్పందించారు.ఒక పక్క రాష్ట్రం తీవ్ర కరవుకాటకాలతో అల్లాడుతుంటే, రైతులు పంటలు నష్టపోయి సంక్షోభంలో చిక్కుకుంటే, ఎటువంటి అభివృద్ధి పనులు ప్రభుత్వం చేపట్టని దుస్థితిలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఆయన మంత్రివర్గ సహచరులు పేదల కష్టంతో తమ విలాసాలను తీర్చుకుంటున్నారని ఆయన ఆరోపించారు. తాము పేదల పక్షమని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వ ద్వంద్వప్రమాణాలకు ఇది అద్దం పడుతోందని ఆయన విమర్శించారు. నిజానికి కేంద్రాన్ని కరవు సహాయ నిధులు కోరడానికి వీరంతా విలాసవంతమైన విమానంలో ఢిల్లీకి వెళుతున్నారని ఆయన చురకలు అంటించారు. మన దుస్థితిని అత్యంత క్రూరంగా అపహాస్యం చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు.

ప్రజలు కట్టిన పన్నులతో కాంగ్రెస్ మంత్రులు తమ విలాసాలు తీర్చుకుంటున్నారంటూ జయేంద్ర విమర్శించారు. జయేంద్ర ట్వీట్ గురించి విలేకరులు అదే విమానంలో సిద్దరామయ్యను ప్రశ్నించగా నరేంద్ర మోడీ ఎలా ప్రయాణిస్తారని ఆయన ఎదురుప్రశ్నించారు. ముందు దీని గురించి చెప్పండి..ఇదే ప్రశ్నను బిజెపి నాయకులను ముందు అడగండి. నరేంద్ర మోడీ ఏ విమానంలో ప్రయాణిస్తారు? ఆయన ఒంటరిగా ప్రయాణిస్తారు..ఎందుకు ఒంటరిగా ప్రయాణిస్తారు? బిజెపి నాయకులు ఇలాంటి పనికిమాలిన మాటలే మాట్లాడుతుంటారు అంటూ సిద్దరామయ్య కౌంటర్ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News