Friday, November 22, 2024

కమలమా?…. కాంగ్రెస్సా?

- Advertisement -
- Advertisement -

జితేందర్ రెడ్డి, డికె అరుణల్లో అంతర్మథనం, కర్నాటక ఫలితాలపై మేధోమధనం, ఈటల నిర్ణయమే ఫైనల్, పోటీ చేసే అభ్యర్దులపై స్పష్టత లేని వైనం, నైరాశక్యంలో క్యాడర్, పట్టుకోల్పోనున్న బిజెపి, కర్నాటక ఫలితాలు కాంగ్రెస్‌కు కలిసి వస్తాయా ?, ప్రధాన పోటీ బిఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్యనే అంటున్న మేధావులు

మన తెలంగాణ/ మహబూబ్‌నగర్ బ్యూరో:  రాష్ట్రంలో బిజెపి దూకుడుకు కర్నాటక ఫలిథాలు కళ్లెం వేసినట్లైంది. అక్కడ బిజెపి అధికారంలోకి వ స్తే ఇక్కడ అధికారం చేజిక్కించుకోవచ్చుననుకున్న కమలం నేతల ఆశలు అడియాశలు అ య్యాయి. కర్నాటక ఫలిథాలు కాంగ్రెస్‌కు ఆక్సీజన్ అందించగా బిజెపిని వెంటలేటరపై ఉంచాయి. క ర్నాటకలో బిజెపి ఖంగుతినడంతో ఇక్కడి బిజెపి అగ్ర నేతల్లో అంతర్మధనం మెదలైంది. ఇక్కడ తమ రాజకీయ భవిష్యత్ ఏమిటన్న డిఫెన్స్‌లో పడిపోయారు. దీంతో ఇటు కార్యకర్తల్లో సైతం నైరాశ్యం మొదలైంది.

ఎన్నికలకు మరో రెండు నెలల్లో నోటిఫికేషన్ వస్తుందన్న కేంద్ర ఎన్నికల కమీషన్ ప్రకటనతో రాజకీయ పార్టీలు హడావిడి మొదలైన్పపటికీ బిజెపిలో ఆ జోష్ కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికీ బిజెపికి ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులు లభించక పోవడ ం ఆ పార్టీకి పూర్తి మైనస్‌గా మారిపోయింది. కొల్లాపూర్ మాజీ మంత్రి బిఆర్‌ఎస్ నేత జూపల్లి కృష్ణరావు సైతం కాంగ్రెస్ గొడుకు కిందికి వెళ్లుతుండడంతో ఉమ్మడి జిల్లా బిజెపి నేతల్లో రాజకీయ అలజడి మొదలైంది. ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా బి ఆర్‌ఎస్, కాంగ్రెస్ మద్యనే పోటీ ఉండవచ్చునని రా జకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.కర్నాటక ఫలిథాలపై బిజెపిలోనే రాష్ట్ర నేతల్లో తలోమాటలు చెబుతుండడంతో కాంగ్రెస్‌లోకి కొందరు బిజెపి నే తలు చేరవచ్చుననే ప్రచారం జోరుగా సాగుతోంది.

Also Read: నీళ్లిస్తున్నారా.. పెన్షన్లు స్తున్నారా?

డికె అరుణ, ఎపి జితేందర్ రెడ్డిలో మేధోమధనం :

ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో బిజెపి సీనియర్ నేతలుగా ఉంటున్న డికె అరుణ, ఎపి జితేందర్ రెడ్డిల రాజకీయ భవిష్యత్ ఏమిటన్నది ప్రశ్నార్దకం గా మారింది. పోటీ బిఆర్‌ఎస్, కాంగ్రెస్ మద్యనే ఉండవచ్చుననే సర్వేలు చెబుతుండడంతో తాము కమలంలోనే ఉండాలా ? లేక కాంగ్రెస్ గూటికి చేరుదామా అన్న మేధోమధనం చేసుకుంటున్నట్లు సమాచారం. డికె అరుణ బిజెపిలో జాతీయ ఉపాధ్యక్షురాలిగా కీలక పోస్టులో కొనసాగుతోంది. మా జీ ఎంపి ఎపి జితేందర్‌రెడ్డి జాతీయ కార్యవర్గ స భ్యులుగా ఉంటున్నారు. వీరిద్దరూ బిజెపిలో చక్ర ం తిప్పే సత్తా ఉన్న నేతలే. అయినప్పటికీ మారిన రా జకీయ పరిస్థితుల నేపథ్యంలో వీరి రాజకీయ పరిస్దితి అగమ్య గోచరంగా మారింది. వీరిద్దరు కూడా హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌వై పు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా బిజెపి ఛీప్ బ ండిసంజయ్‌కు డికె అరుణకు మద్యన విభేధాలు ఉ న్నట్లు తెలుస్తోంది.

బండి సంజయ్ పాదయాత్ర చేసిన సందర్భంగా కూడా గద్వాలల్లో డికె అరుణ పూర్తి మద్దతు ఇవ్వలేదని బండి సంజయ్ అనుచరులు భావించారు. దీంతో వీరిద్దరి మద్య రాజకీ య గ్యాప్ చాలా వచ్చిందని కూడా ఆ పార్టీలో చ ర్చ సాగుతోంది. మరో వైపు ఎపి జితేందర్ రెడ్డి, ఈ టెల రాజేందర్ బిఆర్‌ఎస్ పార్టీలో ఉన్న సమయం లో ఇద్దరు చాలా క్లోజ్‌గా ఉండేవారు. ఈటెలకు, జితేందర్ రెడ్డికి మంచి సంబందాలు ఉన్నాయి. అ యితే రాష్ట్ర బిజెపిలో ఈటెల,బండి సంజయ్ వర్గ విబేదాలు కూడా తీవ్ర రూపం దాల్చుతున్న నేపథ్య ంలో నేతల్లో ఏమి చేయాలన్న ఆలోచనలు పాలు పోవడం లేదు. ఈటెల కూడా ఇటీవల బిజెపిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో డికె అరుణ, ఎపి జితేందర్‌రెడ్డిల ఆలోచనల్లో మార్పులు వచ్చినట్లు తెలుస్తోంది.

ఒక వేళ్ల ఈటెల పార్టీ మారితే వీరిద్దరు కూడా పార్టీ మారే పరిస్దితులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈటెల నిర్ణయాన్ని బట్టే వీరి రాజకీయ భవిష్యత్ ఉంటుందని చర్చ జరుగుతోంది. ఈటెలకు బిజెపి సారధ్యం ఇస్తే వీరిద్దరు కమలంలోనే ఉండే అవకాశాలు ఉన్నాయని, లేక పోతే కాంగ్రెస్ వైపు చూసే అవకాశాలు లేక పోలేదనే రాజకీయ చర్చ జరుగుతోంది. ప్రస్తుతం పాలమూరు బిజెపిలో వీరిద్దరు చాలా స్ట్రాంగ్ నేతలుగా ఉంటూ వస్తున్నారు. డికె అరుణకు గద్వాల్లో పెద్ద ఎత్తున అ నుచర వర్గం ఉంది. మైనార్టీ వర్గం కూడా ఈమె కు అనుకూలంగానే ఉంటున్నారు. అయితే ఆ మె బిజెపిలో ఉండడంతో మైనార్టీ వర్గం బిఆర్‌ఎస్ వైపు వెళ్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో డికె అరుణ సొంత గూడు కాంగ్రెస్‌లోకి చేరితే కొం త కలిసి రావచ్చునని చర్చించుకుంటున్నారు.

పోటీ చేసే అభ్యర్థులపై కమ్మకున్న నీలినీడలు :

బిజెపికి అంతంత మాత్రమే పట్టు ఉన్న ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఇప్పటి వరకు నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్దులు ఎవరన్నది కనీస సంకేతాలు లేక పోవడంతో అటు నేతల్లోనూ, ఇటు క్యాడర్‌లోనూ నిరుత్సాహం వెంటాడుతోంది. ఇప్పటికే బిఆర్‌ఎస్ నుంచి ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ సారి కూడా సిట్టింగులకే సీటు ఇస్తామని సంకేతా లు ఇవ్వడంతో బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు దూకు డు పెంచారు. అయితే ఇప్పటి వర కు బిజెపి అభ్యర్దులు ఎవ రు ఉంటారన్న సంకేతా లు కూడా లేక పోవడంతో వచ్చే ఎ న్నికల్లో అంత ప్రభావం ఉంటుందా అన్న అనుమానాలు ఉన్నాయి. ఇప్పటి నుంచే పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తే తప్ప ప్రజలు అక్కున చేర్చుకునే పరిస్థితి లేదు.పైగా అభ్యర్థుల ప్రకటన లేక పోపవడంతో బిజెపి పోటీ చేసే వారే లేరన్న అధికార పార్టీ చెబుతున్న మాట లు సత్యం ఉండవచ్చుననే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి.

ఇటు కాంగ్రెస్‌లో కూడా అభ్యర్తులు ఎవరన్న దానిపై స్పష్టత లేదు. క ర్నాటక ఫలిథాలు కాంగ్రెస్‌కు కొంత అనుకూల ప రిస్తితిని తీసుకొచ్చినా నాయకత్వాన్ని, క్యాడర్‌ను న డిపించే సత్తా ఉన్న నేతలు లేక పోవ డం ఆ పార్టీకి తీరని లోటుగా భావిస్తున్నారు. కాం గ్రెస్‌లో నేతల మధ్య ఉన్న విబేధాలు ఆ పార్టీని బలహీనపర్చి అవకాశాలు ఉన్నాయి. ఇక కొల్లాపూర్ నుంచి జూపల్లి కాంగ్రెస్‌లోకి చేరుతున్నట్లు వార్త లు వస్తున్న నేపథ్యంలో వనపర్తి, నాగర్ క ర్నూలు జిల్లాలో కాంగ్రెస్‌కు కొంత కలిసి రావచ్చునని చెబతున్నారు.బిజెపిలో ఉద్దండులుగా ఉన్న డికె అరుణ,ఎపి జితేంద ర్ రెడ్డిలు కమలం గూటిలోనే ఇముడుతారా ?లేక కాంగ్రెస్ కండువ కప్పుకుంటారా ? అన్నది కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. అయితే రెండు పా ర్టీల అంతర్గత రాజకీయ శూ న్యతను బి ఆర్‌ఎస్ తనకు అనుకూలంగా మార్చుకుంటూ పట్టు సా ధిస్తు ండ డ ం కొస మెరుపు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News