Friday, December 27, 2024

బిఆర్ఎస్ లో చేరిన బిజెపి నాయకులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో గెలిచేది ముమ్మాటికీ బిఆర్ఎస్ పార్టీ అని మంత్రి హరీశ్ రావు తెలిపారు. సబ్బండ వర్గాల సంక్షేమం గురించి ఆలోచించిన సిఎం కెసిఆర్ పై తెలంగాణ ప్రజలకు అపారమైన ప్రేమ ఉందని ప్రశంసించారు. కాంగ్రెస్, బిజెపి ఎన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్ కొట్టేది కారు అని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్, ఆందోల్ నియోజకవర్గం అల్లాదుర్గ్ మండల మాజీ జెడ్పిటిసి మమతా బ్రహ్మం మంత్రి హరీష్ రావు సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. వివిధ సామాజికఎఉద్యమాల్లో పాల్గొన్న బ్రహ్మం ప్రస్తుతం బిజెపిలో వున్నారు.

ఈ రోజు ఆందోల్ ఎంఎల్ఎ క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ లో చేరిన వారిలో మెదక్ జిల్లా యువజన సంఘాల అధ్యక్షుడు సాయిలు, యువజన నాయకులు పవన్ వార్డు వార్డ్ మెంబర్ నర్సింలు తోపాటు యువజన సంఘాల మండల అధ్యక్షులు మహేష్ గౌడ్, బిజెపి యూత్ అధ్యక్షుడు ఆంజనేయులు, రెగోడ్ మండల బిసి సంఘ అధ్యక్షులు శేఖర్, బిజెపి మోక్ష నాయకులు శేఖర్ తోపాటు 100 మంది కాంగ్రెస్ బిజెపి కార్యకర్తలు ఈరోజు మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో బిఆర్ఎస్ లో చేరారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ఎన్నికల ఇంచార్జ్ ఫారూఖ్ హుస్సేన్ , ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ బిక్షపతితో పాటు బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జైపాల్ రెడ్డిలు, తదితరలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News