Monday, December 23, 2024

బిజెపి నుంచి బిఆర్‌ఎస్‌లో చేరిక

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సంస్థాన్ నారాయణపురం: సంస్థాన్ నారాయణపురం మండలం చిమిర్యాల గ్రామానికి చెందిన బిజెపి సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ గడ్డం స్వామి మరో ముగ్గురు నాయకులతో కలిసి ఆదివారం మునుగోడు శాసన సభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి సమక్షంలో బిఆర్‌ఎస్‌లో చేరారు. వారిని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి బిఆర్‌ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూసుకుంట్ల మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి బిఆర్‌ఎస్‌లో చేరుతున్నారని తెలిపారు.

గత మూడు సంవత్సరాలుగా మునుగోడు అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందన్నారు. ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసి కోమటిరెడ్డి రాజ్గోపాల్‌రెడ్డి తన సొంత పనులు చూసుకున్నాడు తప్పా నియోజకవర్గాన్ని ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. అందుకే ఉప ఎన్నికల్లో మునుగోడు ప్రజలు తనను ఎమ్మెల్యేగా గెలిపించారన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆశీర్వాదంతో నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దోనూరు జైపాల్‌రెడ్డి, ఎంపిటిసి దోనూరు శ్రావణి, బిఆర్‌ఎస్ నాయకులు గడ్డం లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News