Saturday, November 23, 2024

బిజెపి నేతలపై ఉమాభారతి గుస్సా

- Advertisement -
- Advertisement -

భోపాల్: బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా ఆదివారం జెండా ఊపి ప్రారంభించిన జన ఆశీర్వాద్ యాత్రకు తనను ఆహ్వానించకపోవడం పట్ల మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బిజెపి సీనియర్ నాయకురాలు ఉమా భారతి అసంతృప్తి వ్యక్తం చేశారు. తనను చూసి బిజెపి నాయకులు భయపడుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు.

తన నాయకత్వంలో 2003లో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని బిజెపి ఓడించి అధికారాన్ని చేపట్టిందని ఆమె సోమవారం గుర్తు చేశారు. కమల్ నాథ్ సారథ్యంలో 15 నెలల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉడడం మినహాయించి మిగిలినదంతా బిజెపి పాలనేనని ఆమె పేర్కొన్నారు. తాను హాజరైతే బిజెపి నాయకులకు భయపడతారు కాబట్టే తనను ఆ కార్యక్రమానికి ఆహ్వానించి ఉండరని ఆమె అన్నారు. తాను అక్కడ ఉంటే మొత్తం అందరి దృష్టి తనపైనే ఉంటుందని ఆమె పార్టీ నాయకులు ఎవరి పేరును ప్రస్తావించకుండా వ్యాఖ్యానించారు.

మధ్యప్రదేశ్‌కు చెందిన బిజెపి నాయకుడు, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను ప్రస్తావిస్తూ ఆయన తనకు మేనల్లుడితో సమానమని ఉమాభారతి చెప్పారు. ఏదేమైనా తనను యాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించి ఉండవలసిందని ఆమె అన్నారు. పిలిచినా తాను వెళ్లి ఉండేదాన్ని కానని కూడా ఆమె వ్యాఖ్యానించారు. బిజెపి తరఫున అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తాను పాల్గొంటానని, పార్టీ కోసం ఓట్లు సాధిస్తానని ఆమె స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News