Saturday, November 23, 2024

ప్రీతమ్ ముండేకు మంత్రి పదవి రాలేదని బిజెపి నేతల రాజీనామా

- Advertisement -
- Advertisement -

BJP leaders resign For Not Giving Cabinet Berth To Pritam Munde

 

బీడ్ (మహారాష్ట్ర): కేంద్ర మంత్రివర్గ విస్తరణలో స్థానిక ఎంపి ప్రీతమ్ ముండే ఖడేకు చోటు లభించలేదని నిరసనగా బీడ్ జిల్లాకు చెందిన దాదాపు 20 మందికి పైగా బిజెపి నేతలు పార్టీకి రాజీనామా చేశారు. వీరంతా బీడ్ జిల్లా పరిషత్, పంచాయతీ సమితి సభ్యులుగా, అంబజోగై స్థానిక మున్సిపాలిటీ కౌన్సిలర్లుగా పదవుల్లో ఉన్నారని. తమ రాజీనామాలు సమర్పించడానికి ముంబై తరలి వెళ్లారని స్థానిక బిజెపి నాయకుడు ఆదివారం తెలిపారు. బిజెపి జిల్లా అధ్యక్షుడు రాజేంద్ర మస్కేకు వీరంతా తమ రాజీనామా పత్రాలు అందచేశారని చెప్పారు. కేబినెట్‌లోకి తీసుకోడానికి ప్రీతమ్ పేరు పరిశీలన లోకి వచ్చినా ఆఖరి నిమిషంలో పక్కనపెట్టారని బీడ్ జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి సర్జేరావు టాండ్లే ఆరోపించారు. అయితే ప్రీతమ్ సోదరుడు బిజెపి జాతీయ కార్యదర్శి పంకజ ముండే ఈ ఆరోపణలను కొట్టి పారేశారు. మంత్రి పదవి రానందుకు ప్రీతమ్ కుంగిపోయినట్టు వచ్చిన వార్తలను ఖండించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News