Monday, December 23, 2024

ఒరిస్సా ప్రమాద ఘటనపై బిజెపి నేతల దిగ్భ్రాంతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఒరిస్సాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం పట్ల కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు కిషన్‌రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అదే విధంగా బిజెపి జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా కేంద్ర ప్రభుత్వం నేటితో 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలతో పాటు దేశవ్యాప్తంగా జరగాల్సిన కార్యక్రమాలన్నింటినీ వాయిదా వేసుకున్నారు.

ఈ భరించలేని బాధను తట్టుకోగలిగే శక్తిని మృతుల కుటుంబాలకు ప్రసాదించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని వెల్లడించారు. రైలు ప్రమాద మృతులకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంతాపం ప్రకటించారు. రైలు ప్రమాద మృతుల సంతాప సూచకంగా తెలంగాణలో నేడు జరగాల్సిన “మహజన్ సంపర్క్ అభియాన్‌” కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లుబండి సంజయ్ ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News