Monday, December 23, 2024

ఎంపి అర్వింద్‌కు నిరసన సెగలు

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ ఎంపి ధర్మపురి అ ర్వింద్ తీరుపై ఆ జిల్లా బిజెపి కార్యకర్తలు ఆందోళనకు దిగారు. నాంపల్లిలోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఉద్రిక్తత కు దారితీసింది. పార్టీ కార్యాలయంలో ఆ జిల్లాకు సంబంధిత నే తలు బైఠాయించి ఎంపికు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అ ర్వింద్ ఏకపక్షంగా 13 మండలాల అధ్యక్షులను మార్చారని ఆ రోపిస్తూ ఆర్మూర్, బాల్కొండ, బోధన్ మండలాలకు చెందిన కార్యకర్తలు నిరసన తెలిపారు. ఎంపి అర్వింద్ అరాచకాలు పెరిగాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత పార్టీ కార్యకర్తల కు ఎంపి అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా ర్చిన మండలాల అధ్యక్షులను తిరిగి నియమించాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు.

అర్వింద్ పాత వారందరినీ పక్కన పెడుతున్నారంటూ ధ్వజమెత్తారు. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్యాం సుందర్ మాట్లాడుతూ.. ఎంపి అర్వింద్ నిజామాబాద్ జిల్లాలో 13 మండలాల అధ్యక్షులను మార్చివేశారని మండిపడ్డారు. పార్టీ నిబంధనలకు విరుద్ధంగా అధ్యక్షులను మార్చివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలుగజేసుకొని సమస్య పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పార్టీ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి ఉమాశంకర్, నిజామాబాద్ జిల్లా నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. పార్టీ కార్యాలయం నుంచి వెళ్ళాలని ఉమా శంకర్ కోరినా వారు కార్యాలయంలోనే బైఠాయించి నిరసన తెలిపారు. కిషన్ రెడ్డి పార్టీ కార్యాలయంలో ఉండగానే ఇదంతా జరిగింది.

ఆందోళన చేసిన నిజామాబాద్ కార్యకర్తలపై బిజెపి కార్యదర్శి ప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్ర అధ్యక్షుడితో చెప్పకుండా.. మీడియాతో ఎందుకు మాట్లాడుతున్నారని వారిపై ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. దీంతో కార్యకర్తలంతా ప్రకాష్ రెడ్డితో వాగ్వాదానికి దిగారు. అక్కడున్న పార్టీ నేతలు చెప్పినా వినిపించుకోని కార్యకర్తలు.. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తమకు న్యాయం చేయాలని వారు నినాదాలు చేశారు. చివరకు కిషన్ రెడ్డితో సమావేశం ఏర్పాటు చేస్తామని పార్టీ నేతలు హామీ ఇవ్వడంతో కార్యకర్తలు ఆందోళన విరమించారు. ఇదిలా ఉంటే నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని మండల అధ్యక్షుల మార్పుతో తనకు సంబంధం లేదని ఎంపి అర్వింద్ అన్నట్లు సమాచారం. పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా.. నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడే 13 మండలాలకు కొత్త అధ్యక్షులను నియమించారని ఆర్వింద్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News