Thursday, January 23, 2025

రాజ్ నాథ్ ఇంట్లో బిజెపి నాయకుల సమావేశం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: లోక్ సభ స్పీకర్ , డిప్యూటీ స్పీకర్ అభ్యర్థులను ఎంపిక చేసుకునే విషయంలో చర్చించేందుకుగాను బిజెపి అగ్రనేతలు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇంట్లో మంగళవారం సాయంత్రం సమావేశమయ్యారు. హాజరయిన వారిలో మనోహర్ లాల్ ఖట్టర్, భూపేంద్ర యాదవ్, విరేంద్ర కుమార్, పియూష్ గోయల్, అన్నపూర్ణా దేవి, ఎస్. జయశంకర్, జెడి(యూ)కు చెందిన లలన్ సింగ్, లోక్ జనశక్తి పార్టీ(రామ్ విలాస్) నాయకుడు చిరాగ్ పాశ్వాన్ ఉన్నారు.

దిగువ సభ తొలి సమావేశం ఆరంభమైన రెండు రోజులకు లోక్ సభ స్పీకర్ ఎన్నిక జూన్ 26న జరుగనున్నది. ఇదిలావుండగా మహారాష్ట్ర బిజెపి ప్రధాన గ్రూప్ తో కూడా పార్టీ ప్రధాన కార్యాలయంలో వేరుగా ఓ మీటింగ్ సాయంత్రం జరుగనున్నది. అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ వ్యూహంపై చర్చించేందుకు ఈ సమావేశం జరుగనున్నదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

ఈ సమావేశానికి మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాంకులే, ఆశిశ్ శెలర్, ఎంపీ అశోక్ చవాన్, మంత్రి గిరీశ్ మహాజన్, ఇతర నాయకులు హాజరుకానున్నారు. ఈ సమావేశానికి బిజెపి చీఫ్ జెపి. నడ్డా అద్యక్షత వహించనున్నారు.

ఈ సమావేశానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బిజెపి ప్రధాన కార్యదర్శి(ఆర్గనైజేషన్) బి.ఎల్. సంతోష్ కూడా హాజరు కానున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News