Monday, December 23, 2024

నాలుగు రాష్ట్రాల్లో బిజెపి హవా

- Advertisement -
- Advertisement -

bielection

న్యూఢిల్లీ: ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలకు సంబంధించి ఆదివారం కౌంటింగ్ చేపట్టిన విషయం తెలిసిందే! ఇందులో నాలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. రెండు రాష్ట్రాల్లోని అసెంబ్లీ సెగ్మెంట్ లో ఒకటి తెలంగాణ కాగా, మరొకటి మహారాష్ట్ర.. మహారాష్ట్రలోని అంధేరీ ఈస్ట్ కు జరిగిన బైపోల్ లో ఉద్ధవ్ థాక్రే వర్గానికి చెందిన శివసేన పార్టీ అభ్యర్థి లీడ్ లో ఉన్నారు. తెలంగాణలో టిఆర్ఎస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు.

బిజెపి అభ్యర్థులు ముందంజలో ఉన్న రాష్ట్రాల విషయానికి వస్తే ఉత్తరప్రదేశ్ లోని గోలా గోక్రనాథ్, హర్యానాలోని ఆదంపూర్, బీహార్ లోని గోపాల్ గంజ్, ఒడిశాలోని ధాంనగర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బిజెపి లీడ్ లో ఉంది. బీహార్ లోని మరో అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల ఫలితాలలో రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడి) అభ్యర్థి ముందంజలో దూసుకుపోతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News