Monday, December 23, 2024

ట్రెండింగ్‌లో #బిజెపి లీక్స్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో ప్రశ్నాపత్రాల లీకేజీల వ్యవహారం సంచలనంగా మారింది. పదో తరగతి పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారంలో బండి సంజయ్ అరెస్ట్ కావడంతో బీజేపీ లీక్స్ హాష్ ట్యాగ్ (#BJPLeaks) ట్రెండింగ్ లో నిలిచింది. బిఆర్‌ఎస్ నాయకులు, మద్దతుదారులు ఈ హాష్ ట్యాగ్ తో ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. దీంతో బిజెపి లీక్స్ ప్రస్తుతం ట్రెండింగ్ లో నిలిచింది. మొత్తంగా12,300 ట్విట్స్‌తో టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. సోషల్ మీడియా వేదికగా బిజెపిని, బండి సంజయ్‌ని బిఆర్‌ఎస్ నేతలు టార్గెట్ చేశారు. వేర్ ఈజ్ యువర్ ఫోన్ బండి?అని ప్రశ్నిస్తూ బండి సంజయ్‌ను టార్గెట్ చేశారు. టెన్త్ క్వశ్చన్ పేపర్ల లీకేజీ వెనుక బీజేపీ కుట్ర ఉందని, ఆ కుట్ర వెనుక బండి సంజయ్ మాస్టర్ ప్లాన్ ఉందని బిఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.

తమ రాజకీయ లబ్ది కోసం, బిఆర్‌ఎస్‌ను బద్నామ్ చేసేందుకు విద్యార్థుల జీవితాలతో బండి సంజయ్ చెలగాటం ఆడుతున్నారని బిఆర్‌ఎస్ నేతలు ఆగ్రహావేశాలు కనబరుస్తున్నారు. బిజెపి నేతలకు చదువు విలువ తెలియదన్నారు. రాష్ట్రం నుంచి ఢిల్లీ దాకా ఆ పార్టీలో ఫేక్ సర్టిఫికెట్ల నేతలు ఎక్కువ అని విమర్శించారు. తాండూరులో తెలుగు క్వశ్చన్ పేర్, వరంగల్ లో హిందీ క్వశ్చన్ పేపర్ లీక్ కు పాల్పడింది బిజెపి కార్యకర్తలే అని బిఆర్‌ఎస్ నాయకులు ఆరోపించారు. ఈ రెండు ఘటనల వెనుక బండి సంజయ్ కుట్ర ఉందన్నారు. తాండూరులో వాట్సాప్ లో క్వశ్చన్ పేపర్ లీక్ చేసిన టీచర్ బీజేపీ ఉపాధ్యాయ సంఘం నేత అని అన్నారు. ఇక వరంగల్ లో హిందీ పేపర్ లీక్ చేయడానికి ప్రయత్నించిన ప్రశాంత్ కరుడుగట్టిన బీజేపీ కార్యకర్త, బండి సంజయ్ అనుచరుడు అని ఆరోపణలు చేశారు. బీజేపీ నేతలతో ప్రశాంత్ దిగిన ఫొటోలను, పోస్టర్లను బిఆర్‌ఎస్ నేతలు మీడియాకు చూపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News