Monday, December 23, 2024

నేడు ఎన్‌డిఎ కీలక విందు సమావేశం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికలను పరిగణనలోకి తీసుకుని బిజెపి మంగళవారం (నేడు) కీలకమైన ఎన్‌డిఎ సమావేశం ఏర్పాటు చేసుకుంది. ఓ వైపు బెంగళూరులో విపక్షాలు ఐక్యత దిశలో రెండు రోజుల భేటీకి దిగుతున్న దశలో ఎన్‌డిఎ సమావేశం బలప్రదర్శనగా భావిస్తున్నారు. 38 పార్టీలు హాజరు అవుతాయని బిజెపి అధ్యక్షులు జెపి నడ్డా తెలిపారు. ఎన్‌డిఎ బలోపేతం అయిందని, ఇక ముందు మరింత అవుతుందని ఈ పరిణామం చెపుతుందని ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం నాటి ఎన్‌డిఎ సమావేశానికి 38 పార్టీలు హాజరు అవుతాయని నడ్డా సోమవారం తెలిపారు. తాము సమావేశానికి వస్తున్నట్లు 38 పార్టీల నేతలు నిర్థారించారని వివరించారు. నిర్థారించారు.

ఇప్పుడున్న మిత్రపక్షాలు, కొత్తగా వచ్చిచేరే పార్టీల నేతలతో ఎన్‌డిఎ సమావేశం జరుగుతుంది. ఈ కీలక భేటీ తరువాత బిజెపి ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేయనుంది. ఈ మధ్యకాలంలో పార్టీ నేతలు అమిత్ షా, జెపి నడ్డాలు పలు పార్టీల నేతలతో మంతనాలు జరిపారు. కూటమిని వీడిన వారిని బుజ్జగించడం, వారిని వెనకకు రప్పించడం వంటి వాటిపై మంతనాలు జరిగాయి. మరో వైపు కూటమిలోకి వచ్చే పార్టీల ప్రవేశానికి ఆమోదముద్ర వేయడం జరుగుతోంది. ఇప్పటి ఎన్‌డిఎ భేటీకి ఎన్ని పార్టీలు హాజరవుతాయనేది వెల్లడికాలేదు. అయితే దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఎన్‌డిఎకు సముచిత ప్రాతినిధ్యం ఉందనే విషయాన్ని ఈ భేటీ ద్వారా చాటుకోవాలని తలపెట్టారు.

స్థానిక అశోకా హోటల్ వేదికగా ఎన్‌డిఎ సమావేశం ఉంటుంది. ఇటీవలి కాలంలో ఎన్‌డిఎకు జనతాదళ్ (యునైటెడ్) , ఉద్ధవ్ థాకరే శివసేన వర్గం దూరం అయింది. కాగా ఇదే క్రమంలో షిండే వర్గపు శివసేన, అజిత్ పవార్ ఎన్‌సిపి, బీహార్‌లో జితన్ రామ్ మాంజీ సారధ్య హామ్, యుపిలో రాజ్‌భర్ ఎస్‌బిఎస్‌పి , ఉపేంద్ర కుష్వాలా నేతృత్వపు ఆర్‌ఎల్‌ఎస్‌పి చేరువ అయ్యాయి. ఎన్‌డిఎ భేటీకి ప్రధాని మోడీ , ఇతర ప్రముఖ నేతలు హాజరయ్యే ఈ సమావేశానికి రావల్సిందిగా పార్టీ అధ్యక్షులు జెపి నడ్డా ఆహ్వానాలు పంపించారు. ఎపి నుంచి హీరో పవన్ కల్యాణ్ జనసేన, తమిళనాడు నుంచి అన్నాడిఎంకె హాజరవుతాయి. ఇక ఈశాన్య రాష్ట్రాలకు చెందిన పలు పార్టీల నేతలు కూడా రానున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News