Monday, December 23, 2024

మొసలి లేక కొండచిలువ వంటిది బిజెపి..తమతో ఉన్నవారిని మిగేస్తుంది: సంజయ్ రౌత్

- Advertisement -
- Advertisement -

ముంబై: నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్(ఎన్‌డిఏ)లో శివసేనకు సవతి తల్లి వైఖరి లభించిందని శివసేన ఎంపీ గజానన్ కీర్తికర్ అన్న నేపథ్యంలో శివసేన(యుబిటి) నాయకుడు సంజయ్ రౌత్ మాట్లాడుతూ ‘బిజెపి ఓ మొసలి, కొండచిలువ వంటిది, దాంతో ఎవరు కలిసి ఉన్నా అది మింగేస్తుంది’ అన్నారు. రౌత్ విలేకరులతో మాట్లాడుతూ ‘అందుకనే పార్టీ చీఫ్ ఉద్ధవ్ థాక్రే 2019లో బిజెపికి దూరం అవ్వాలని నిర్ణయించుకుంది, దాంతో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత అవిభక్త శివసేన, బిజెపి నుంచి వేరయింది’ అన్నారు. మొసలి వంటి బిజెపికి ఇప్పుడు ఉద్ధవ్ థాక్రే దూరంగా ఉన్నారన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో కూడా చాలా అసఖ్యత ఉందని రౌత్ అన్నారు.
‘శివసేన(యుబిటి) పరిస్థితి కూడా గజనాన్ కీర్తికర్ చెప్పినట్లే ఉంది. వారు(బిజెపి) అన్న మాట నిలబెట్టుకోలేదు, శివసేన ఎంఎల్‌ఏలకు వారు నిధులు కూడా ఇవ్వలేదు, అంతేకాక వారు శివసేన నాయకులను అవమానించే ప్రయత్నం చేశారు. అందుకనే పార్టీ గౌరవాన్ని కాపాడుకునేందుకే ఉద్ధవ్ థాక్రే ఆ నిర్ణయం తీసుకున్నారు’అని రౌత్ తెలిపారు.

శివసేన ఎంపీ కీర్తికర్ శుక్రవారం ‘ఎన్‌డిఏలో మేము భాగస్వాములం…ఆ మేరకే మా పనులు చేపట్టాల్సి ఉండింది. ఎన్‌డిఏ నియోజక వర్గాలు(తగురీతిలో) స్థితిని పొందాలి. అయితే మా పట్ల సవతి తల్లి వైఖరిని కనబరుస్తున్నట్లుగా ఉంది’ అన్నారు.
థాక్రే నేతృత్వంలోని శివసేన 2019లో ఎన్‌డిఏ నుంచి విడిపోయింది. తర్వాత థాక్రే శివసేన పార్టీ కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలతో కలిసి మహా వికాస్ అఘడి(ఎంవిఎ) అనే సంకీర్ణాన్ని రూపొందించింది. తర్వాత మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ శివసేనలోని తిరుగుబాటు నాయకుడు షిండే పార్టీని చీల్చాడు. దాంతో ఎంవిఎ ప్రభుత్వం గత ఏడాది కూలిపోయింది. తర్వాత ఏక్‌నాథ్ షిండే బిజెపితో పొత్తు పెట్టుకుని ముఖ్యమంత్రి అయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News