Friday, December 20, 2024

15 సీట్లకే బిజెపి పరిమితం.. తెలంగాణలో 14 స్థానాలు మావే

- Advertisement -
- Advertisement -

ఇండియా కూటమికి 115-120 సీట్లు
తెలంగాణలో 14 స్థానాలు మావే
ఎన్‌డి టివి ఇంటర్వ్యూ రేవంత్ రెడ్డి ధీమా

న్యూఢిల్లీ: దక్షిణాది ఓటర్ల మద్దతు కూడగట్టడం బిజెపికి అసాధ్యమని, రానున్న లోక్‌సభ ఎన్నికలలో దక్షిణాది రాష్ట్రాలలోని మొత్తం 130 సీట్లలో 15 సీట్లకు మిచంఇ ఆ పార్టీకి దక్కే అవకాశం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు ఎ రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాలు ప్రత్యేకంగా తమిళనాడు, కేరళలో బలం పెంచుకునేందుకు బిజెపి దృష్టి సారించింది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ రెండు రాష్ట్రాలలో గత కొన్ని వారాలలో డజనుకు పైగా పర్యటనలు జరిపారు. అయితే ఆయన(మోడీ) ఆశిస్తున్న మద్దతు లభించే అవకాశం లేదని ఎన్‌డిటివికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

దక్షిణాదిలోని 130 సీట్లలో 115 నుంచి 120 సీట్లను ఇండియా కూటమి గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో అధికార బిఆర్‌ఎస్‌ను, బిజెపిని మట్టికరిపించి కాంగ్రెస్ పార్టీ విజయతీరాలకు చేర్చిన రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. దక్షిణాదివ్యాప్తంగా 130 సీట్లు ఉన్నాయి..బిజెపికి మహా అయితే 12 నుంచి 15 సీట్లు లభించవచ్చు. మిగిలినవన్నీ ఇండియా కూటమి ఖాతాలోకే వెళతాయి అని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. కేరళలోని అట్టింగల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి సిట్టింగ్ ఎంపి ప్రకవాశ్ తరఫున ప్రచారం చేస్తున్న రేవంత్ రెడ్డి ఎన్‌డి టివితో మాట్లాడుతూ కేరళలోని 20 లోక్‌సభ స్థానాలను ఇండియా కూటమే దక్కుంచుకుంటున్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కేరళలో ఇప్పటి వరకు ఒక్క లోక్‌సభ స్థానాన్ని కూడా మోడీకి చెందిన బిజెపి గెలుచుకోలేదని, గత రెండు అసెంబ్లీ ఎన్నికలలో 180 స్థానాలలో పోటీ చేసినప్పటికీ ఒకే ఒక్క స్థానాన్ని దక్కించుకుందని ఆయన చెప్పారు.

ఇప్పటి లోక్‌సభ ఎన్నికలలో పోటీచేస్తున్న స్థానాలలో బిజెపికి డిపాజిట్ కూడా దక్కే అవకాశం లేదని రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. 2019 ఎన్నికలలో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు( యుపిఎ ఛత్రం కింద) రాష్ట్రంలోని అన్ని స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయినప్పటికీ స్వల్పంగా ఓటు శాతం పెరగడం బిజెపికి ఊరటనిచ్చింది. కేరళలో ఈ ఎన్నికలలో ఇండియా కూటమిఓలని ప్రధాన పక్షాలైన సిపిఎం, కాంగ్రెస్ తలపడుతుండడంతో బిజెపి మూడవ స్థానానికి పరిమితమయ్యే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయి. తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలలో 14 స్థానాలు ఇండియా కూటమికి దక్కడం ఖాయమని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

గత లోక్‌సభ ఎన్నికలలో పుదుర్చేరి, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళలో చిత్తుగా ఓడిపోయిన బిజెపి తెలంగాణలో మాత్రం నాలుగు స్థానాలను గెలుచుకోగలిగింది. అయితే కర్నాటకలోని 28 స్థానాలలో 25 స్థానాలను బిజెపి గత ఎన్నికల్లో గెలుచుకుంది. ఈ ఎన్నికలలో 370 స్థానాలను సొంతంగా గెలుచుకోవాలని లక్షం పెట్టుకున్న బిజెపి కర్నాటకలో మరిన్ని స్థానాలను సాధించవలసి ఉంటుంది. అయితే అది జరిగే అవకాశం లేదని రేవంత్ వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ చెబుతున్న అప్ కీ బార్ 400 పార్ నినాదాన్ని ప్రస్తావిస్తూ 2023 అసెంబ్లీ ఎన్నికలలో బిఆర్‌ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావు కూడా ఇదే రకమైన ప్రచారం చేశారని, 100 సీట్లు ఖాయమంటూ ప్రకటించిన కెసిఆర్ 39 సీట్లకే పరిమితం అయ్యారని రేవంత్ చెప్పారు. ప్రజలను తికమక పెట్టేందుకు ఇప్పుడు బిజెపి కూడా అదే రకంగా ప్రచారం చేస్తోందని, అయితే బిజెపికి బుద్ధి చెప్పేందుకు ఓటర్లు సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News