Friday, December 20, 2024

ప్రజలను లూటీ చేస్తున్న బిజెపి

- Advertisement -
- Advertisement -

 

పెట్రోల్ ధరలపై ఖర్గే ఆగ్రహం

న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్రంపై మండిపడ్డారు. గత కొద్ది నెలలుగా అంతర్జాతీయ ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ బిజెపి దోపిడీ ఆగలేదని వారు ఆరోపించారు. 2014 మే 18న బ్యారెల్ ముడి చమురు ధర 87.65 డాలర్లు ఉండగా ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 71.51, డీజిల్ ధర రూ.57.28 ఉందని గురువారం ఖర్గే తెలిపారు.

2022 డిసెంబర్ 1న బ్యారెల్ ముడి చమురు ధర 87.55 డాలర్లు ఉండగా లీటర్ పెట్రోల్ ధర రూ. 96.72, డీజిల్ ధర రూ. 89.62 ఉందని ఆయన తెలిపారు. గడచిన పది నెలలలో అత్యంత కనిష్టంగా ముడి చమురు ధర ఉన్నప్పికీ బిజెపి లూటీ మాత్రం గరిష్ఠ సాయిలో ఉందని ఆయన విమర్శించారు. ఇదే అంశంపై రాహుల్ గాంధీ కూడా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు.

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు 25 శాతం తగ్గినప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం దేశంలో పెట్రోల్ , డీజిల్ ధరలను ఒక్కపైసా తగ్గించలేదని ఆయన తెలిపారు. ధరల పెరుగుదలతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నప్పటికీ ప్రధానమంత్రి మాత్రం పన్నుల వసూళ్లలో బిజీగా ఉన్నారంటూ ఆయన ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News