- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలిగా డాక్టర్ శిల్ప బాధ్యతలు చేపట్టారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం పదవి స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఆకుల విజయ, రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ, మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షులు పన్నాల హరీశ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఎస్. ప్రకాశ్ రెడ్డితో పార్టీ నాయకులు అయోధ్యలో రామ మందిర నిర్మాణం, ప్రాణ ప్రతిష్ట అయిన సందర్భంగా టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు.
- Advertisement -