Wednesday, January 22, 2025

బిజెపి మహిళా నేతకు బురిడి: ఒకరి అరెస్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః ఎంఎల్‌ఎ టికెట్ ఇప్పిస్తానంటూ బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతామూర్తికి ఫోన్ చేసిన సురభి శ్రీనివాస్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. తనకు ముఖ్యమంత్రి, మంత్రులతో పరిచయం ఉందని, ఎంఎల్‌ఎ టికెట్ ఇప్పిస్తానని పలువురిని శ్రీనివాస్ మోసం చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. సికింద్రాబాద్‌లోని ఓ హోటల్ కేంద్రంగా టికెట్ల దందాను శ్రీనివాస్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తికి శ్రీనివాస్ ఫోన్ చేసి ఎంఎల్‌ఎ టికెట్ ఇప్పిస్తానని మాయమాటలు చెప్పాడు. అనుమానం వచ్చిన ఆమె సికింద్రాబాద్ మెండా మార్కెట్ పోలీసులకు ఫిర్యాడు చేయడంతో రంగలోకి దిగిన పోలీసులు బుధవారం రాత్రి శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు.

ఈ సందర్భంగా గీతామూర్తి మాట్లాడుతూ.. తనతో పాటు కొందరు బిజెపి నేతలకు సురభి శ్రీనివాస్ ఫోన్ చేసి సికింద్రాబాద్‌లో మీటింగ్ ఉందని చెప్పాడన్నారు. విషయం కనుగొనేందుకు తాను బిజెపి రాష్ట్ర కార్యాలయానికి ఫోన్ చేస్తే సురభి శ్రీనివాస్ ఫేక్ మీటింగ్ పెట్టాడని పార్టీ నేతలు చెప్పినట్లు ఆమె తెలిపారు. తమ ఫోన్ నెంబరు ఎక్కడ నుంచి మీకు వచ్చాయని సురభి శ్రీనివాస్‌ను తాను ప్రశ్నిస్తే, బిజెపి రాష్ట్ర కార్యాలయం నుంచి సేకరించినట్లు చెప్పాడని ఆమె వెల్లడించారు. సురభి శ్రీనివాస్ లాంటి వ్యక్తులు నిర్వహించే ఫేక్‌మీటింగ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని బిజెపి నాయకులు, కార్యకర్తలకు గీతామూర్తి విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News