ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని గోమతి ఆపార్ట్‌మెంట్‌లో బిజెపి ఎంపి రామ్‌స్వరూప్ శర్మ అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. ఆర్‌ఎంఎల్ ఆస్పత్రి దగ్గరలోని గోమతి ఆపార్ట్‌మెంట్‌లో రామ్ స్వరూప్ శర్మ నివసిస్తున్నాడు. ఆయన సెక్యూరిటీ సిబ్బంది ఫోన్ చేసిన లిఫ్ట్ చేయకపోవడంతో స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు అక్కడికి చేరుకొని.. గది తలుపులు బద్దలు కొట్టి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. రామ్‌స్వరూప్ శర్మ ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. సదరు ఎంపికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ నియోజకవర్గం నుంచి 2014, 2019లో విజయం సాధించారు. ఎంపి కన్నుమూయడంతో బిజెపి పార్లమెంటరీ సమావేశం రద్దు చేసింది. గత నెలలో దాద్రా నగర్ హవేలీ ఎంపి మోహన్ దేల్కర్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. మండి జిల్లాలోని జల్ పూర్ గ్రామంలో 1958లో జన్మించారు.
బిజెపి ఎంపి రామ్‌స్వరూప్ శర్మ ఆత్మహత్య?
- Advertisement -
- Advertisement -
- Advertisement -