Saturday, November 23, 2024

ప్రతీ గ్రామానికి రోడ్లు వేశాం: నడ్డా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: డా బిఆర్ అంబేడ్కర్ జయంతి రోజు సంకల్ప్ పత్ర విడదల చేయడం సంతోషకరమైన విషయమని బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా తెలిపారు. సామాజిక న్యాయంక కోసం అంబేడ్కర్ జీవితాంతం పోరాటం చేశారని, అంబేడ్కర్ సూచించిన మార్గంలో తాము కూడా నడుస్తున్నామని, అంబేడ్కర్ ఆకాంక్షలను అమలు చేస్తున్నామని వివరించారు. బిజెపి సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టో విడదల చేసిన సందర్భంగా నడ్డా ప్రసంగించారు. సంకల్ప్ పత్ర పేరుతో బిజెపి మేనిఫెస్టో విడుదల చేసిందని, మోడీ గ్యారెంటీ, 2047 నాటికి వికసిత భారత్ థీమ్‌తో మేనిఫెస్టో విడుదల చేశామన్నారు. దేశ ప్రగతి, యువత, మహిళలు, పేదలు, రైతులే అజెండాగా సంకల్ప్ పత్ ఉంటుందని వివరించారు. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని 27 మంది సభ్యుల కమిటీ మేనిఫెస్టో రూపొందించిందని వివరించారు. మేనిఫెస్టో కోసం 15 లక్షల సలహాలు, సూచనలను కమిటీ పరిశీలించిందన్నారు.

వచ్చే ఐదేళ్లు దేశానికి ఎలా సేవ చేస్తామో అనేది తమ మేనిఫెస్టో చెబుతుందని, అందరినీ కలుపుకుని ముందుకెళ్తేనే దేశ ప్రగతి సాధ్యమని బిజెపి విశ్వాసమని, మోడీ నేతృత్వంలో పదేళ్లుగా దేశం అభివృద్ధిలో పరుగులు తీస్తోందన్నారు. దేశ ప్రజలు తమకు రెండు సార్లు స్పష్టమైన మెజార్టీ ఇచ్చినందకు కృతజ్ఞతలు తెలిపారు. బిజెపి వచ్చాక మారుముల గ్రామాలకు సైతం పక్కా రోడ్లు వేశామని, ఇవాళ రోడ్డు లేని గ్రామం లేదని చెప్పవచ్చని, గ్రామాలకు ఇంటర్‌నెట్ సౌకర్యం కల్పించామని, 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ ఇస్తున్నామని, పేదలకు బియ్యం, గోధుమలు, పప్పులు అందిస్తున్నామని చెప్పారు. పేదల జీవితాల్లో మార్పు రావాలనేదే తమ లక్షమని స్పష్టం చేశారు. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనేదే తమ నినాదమని పిలుపునిచ్చారు. సామాజిక సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News