Friday, December 20, 2024

అవినీతి.. అక్రమమద్యాల బిజెపి

- Advertisement -
- Advertisement -

BJP means corruption and illegal liquor:Kejriwal

గుజరాత్ సభలో కేజ్రీవాల్ దాడి

బొడేలి (గుజరాత్ ) : భారతీయ జనతాపార్టీ అవినీతికి, కల్తీసారాకు పర్యాయపదం అయిందని, ఈ పార్టీని గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో తిప్పికొట్టాలని ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ పిలుపు నిచ్చారు. అధికారంలో ఉన్న బిజెపి నేతల అండదండలతోనే అన్ని రకాల అవినీతి పనులు యధేచ్ఛగా సాగుతున్నాయి. అక్రమ మద్యం వ్యాపారులు తమ దందాలు నడిపిస్తున్నారు. రాబోయే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు విశ్వసనీయ ఆమ్ ఆద్మీపార్టీకి, అవినీతి అక్రమ వ్యవహారాల బిజెపికి మధ్య ముఖాముఖీ పోరుగా నిలుస్తాయని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఢిల్లీ సిఎం ఆదివారం గిరిజనుల సంఖ్య ఎక్కువగా ఉన్న ఛోటా ఉదేపూర్ జిల్లాలో పలు సభలలో ప్రసంగించారు. ఇక్కడ కాంగ్రెస్ క్రమేపీ తన బలం , ఉనికి కోల్పోయింది. ఈ పార్టీకి ఓటేసి కూడా లాభం లేదు. పార్టీ నేతలు అంతా వరుసగా బిజెపిలో చేరుతారు. రాష్ట్రంలో ఈసారి కాంగ్రెస్‌కు ఒక్క స్థానం కూడా రాదు. ఇప్పుడు బిజెపిని ఢీకొనేది కేవలం ఆప్ అని తెలిపారు. తమ పార్టీని గెలిపించి , అవినీతికర బిజెపి సర్కారును సాగనంపాల్సి ఉందని కేజ్రీవాల్ పిలుపు నిచ్చారు.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది డిసెంబర్‌లో జరగాల్సి ఉంది. గుజరాత్‌లో పేరుకు మద్యపాన నిషేధం ఉంది. అయితే కల్తీసారా, అక్రమ మద్యం వ్యాపారాలు దండిగా సాగుతున్నాయి. ఇటీవల ఇక్కడ నాటుసారా తీసుకున్న ఘటనల్లో 42 మంది దుర్మరణం చెందడాన్ని కేజ్రీవాల్ ప్రస్తావించారు. గుజరాత్‌లో ఏ మూలకు వెళ్లినా దండిగా అక్రమ సారా దొరుకుతుంది. అయితే బిజెపి నేతలు రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం ఉందని చెపుతూ ఉంటారు. మరి ఇంతటి భారీ స్థాయి అక్రమ వ్యాపారాలకు ఎవరు దిగుతున్నట్లు? అదృశ్య శక్తులు ఉన్నాయా? అని నిలదీశారు. బిజెపికి ఓటేస్తే గుజరాత్ ప్రజలు తమ పిల్లలకు పాల బదులు చీప్ లిక్కర్ తాగించాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News