- Advertisement -
29న అమిత్ షా పర్యటన యథాతథం
హైదరాబాద్ : ఈ నెల 29న రాష్ట్రానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్నారు. అయితే ముందుగా నిర్ణయించిన ప్రకారం ఖమ్మం బహిరంగ సభ రద్దు చేసుకొని ఇతర అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనేలా బిజెపి రాష్ట్ర కమిటీ కార్యాచరణ చేస్తోంది. ఖమ్మం సభకు బదులు అమిత్ షా పాల్గొనేలా హైదరాబాద్‌లో పార్టీ కార్యక్రమం పెట్టుకోవాలని యోచిస్తోంది. కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, ముఖ్యనేతలతో ఆయనతో సమావేశం కానున్నారు. అదే విధంగా వివిధ పార్టీలకు చెందిన కొందరు నేతల బిజెపిలో చేరనున్నట్లు సమాచారం.
- Advertisement -