Wednesday, January 22, 2025

రేపు బిజెపి దక్షిణాది రాష్రాల సమావేశం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రానున్న పార్లమెంట్ ఎన్నికలు, దక్షిణాదిలో భారతీయ జనతాపార్టీ విస్తరణ తదితర అంశాలు ఎజెండాగా దక్షిణాది రాష్రాల ముఖ్యనేతలతో బిజెపి అగ్రనేతలు భేటికానున్నారు. ఆదివారం హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ బిజెపి రాష్ట్ర కార్యాలయంలో దక్షిణాది రాష్ట్రాల బిజెపి నాయకులతో జాతీయ నాయకత్వం ఉదయం నుంచి సాయంత్రం వరకు సమావేశం కానున్నది.

ఈ సమావేశానికి 11 రాష్ట్రాల రాష్ట్ర అధ్యక్షులు హాజరుకానున్నారు. ఈ భేటీలో రాష్ట్రాల నేతలకు బిజెపి అగ్రనేతలు అమిత్ షా, జెపి నడ్డా దిశానిర్దేశం చేయనున్నారు. అయిదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. అగ్ర నేతల రాక నేపథ్యంలో నాంపల్లి పరిసర ప్రాంతాల్లో పోలీసుల అప్రమత్తం అయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News