Friday, November 22, 2024

యూపిలో బిజెపి మొత్తం 80 లోక్‌సభ సీట్లూ కోల్పోవచ్చు: అఖిలేశ్

- Advertisement -
- Advertisement -

లక్నో: 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో బిజెపి మొత్తం 80 పార్లమెంటు సీట్లలోనూ ఓటమిపాలవచ్చునని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ తెలిపారు. ‘బిజెపి ఇస్ బార్.. హోసక్తా హై సారీ 80 సీట్స్ హారజాయే’ అని ఆయన హిందీలో చెప్పారు. ‘వచ్చే 50 ఏళ్లు పాలిస్తానన్న ఆ పార్టీ ఇప్పుడు తన దినాలను లెక్క పెట్టుకుంటోంది. ఆ పార్టీ నాయకుడు రాష్ట్రంలోని రెండు వైద్య కళాశాలలను సందర్శించాలి. దాంతో ఆయనకి రాష్ట్రంలో ఎన్ని సీట్లు గెలుస్తారో అర్థం అవుతుంది’ అన్నారు. లక్నోలో కార్యవర్గ సమావేశం నిర్వహిస్తున్న బిజెపి… కస్టోడియల్ మరణానికి గురైన బాధితుల కుటుంబాలకు రూ. 1 కోటి, వారి కుటుంబంలోని వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు. కాన్పూర్‌లో డిసెంబర్ 12,13 తేదీల మధ్య రాత్రి వ్యాపారి సింగ్(27) కస్టోడియల్ మరణానికి గురయ్యారు. ఆయన పోస్ట్‌మార్టం నివేదిక ఆయనకి ఛాతీ, ముఖం, తొడలు, కాళ్లు, చేతులు,అరికాళ్లపై గాయాలున్నట్లు పేర్కొందన్నారు.

అఖిలేశ్ యాదవ్ రాష్ట్రానికి వచ్చే పెట్టుబడుల విషయంలో ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా దుయ్యబట్టారు. ‘వారు లండన్ నుంచి, న్యూయార్క్ నుంచి పెట్టుబడులు తెస్తామని చంకలు గుద్దుకున్నారు. కానీ ఇప్పుడు వారు జిల్లాల నుంచి పెట్టుబడులు తెస్తున్నారు. ఎవరిని వారు వెధవలని చేస్తున్నారు?’ అని నిలదీశారు. ‘వారు ఇతర రాష్ట్రాలకు వెళ్లి వస్తున్నారు, ఇప్పటికే తమ స్వంత కార్యక్రమాలు(పెట్టుబడి) నడుపుతున్నారు. వారు ప్రజలని కేవలం పిచ్చోళ్లని చేస్తున్నారంతే’ అంటూ చెప్పుకొచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News