Friday, December 20, 2024

నువ్వు వేశ్యల బ్రోకర్‌వి: ఎమ్మెల్యే… నీ నాలుక కోస్తా: మంత్రి

- Advertisement -
- Advertisement -

 

బెంగళూరు: కర్నాటకలో అధికార బిజెపికి చెందిన మంత్రి, ఒక ఎమ్మెల్యే పరస్పరం బూతులతో తిట్ల వర్షం కురిపించుకున్నారు. రాష్ట్ర భారీ పరిశ్రమల మంత్రి మురుగేష్ ఆర్ నీలానీని వేశ్యల బ్రోకర్ అంటూ బిజెపి ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ దూషించగా నోటికొచ్చినట్లు వాగితే నాలుక కోస్తా అంటూ ఎమ్మెల్యేపై మంత్రి మండిపడ్డారు. పంచమసలి లింగాయత్ ఉపకులానికి ఓబిసి క్యాటగిరి కింద రిజర్వేషన్ కోటా కల్పించడం గురించి ఎమ్మెల్యే పాటిల్ మాట్లాడుతూ మంత్రి మురుగేష్ నీలానీని వేశ్యల బ్రోకర్ అంటూ తిట్టారు. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై పట్ల కూడా తనకు నమ్మకం లేదని, అందుకే పార్టీ అధిష్టానవర్గాన్ని ఆశ్రయించానని ఎమ్మెల్యే తెలిపారు.

దీనిపై మంత్రి మురుగేష్ నీలాని స్పందిస్తూ తనను వేశ్యల బ్రోకర్ అంటూ పాటిల్ దూషించారని, ఆయన ఆ సంస్కృతివాడు కాబట్టే అదే భాష మాట్లాడుతున్నారని విమర్శించారు. ఒక తండ్రికి పుట్టినవాడు ఎవడూ అలాంటి భాషను ఉపయోగించరని కూడా నీలాని అన్నారు. నోటికొచ్చినట్లు వాగితే ఆయన నాలుక చీరేస్తానంటూ నీలాని హెచ్చరించారు. శాంతంగా ఉండాలంటూ ముఖ్యమంత్రి బొమ్మై అందరికీ చెప్పారని, పార్టీలో ఉండడం ఇష్టం లేకుంటే బయటకు వెళ్లిపోవచ్చని ఎమ్మెల్యేకు ఆయన సలహా ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News