Wednesday, January 22, 2025

నామినేషన్ వేసేందుకు మంత్రి పరుగులు

- Advertisement -
- Advertisement -

BJP Minister runs for nomination

బాలియా : ఉత్తరప్రదేశ్ క్రీడాశాఖ మంత్రి ఉపేంద్ర తివారీ నామినేషన్ దాఖలు చేసేందుకు సమయం దగ్గర పడడంతో పరుగులు తీశారు. బాలియాలోని కలెక్టరేట్ ఆఫీసుకు తొలుత నామినేషన్ వేసేందుకు ర్యాలీతో వెళ్లారు. అయితే ఆఫీస్ గేటు వద్దకు వచ్చిన తరువాత ఆయన నామినేషన్‌కు సమయం దగ్గరపడింది. కేవలం మూడు నిమిషాలు మాత్రమే మిగిలి ఉండడంతో మంత్రి గేటు నుంచి ఆఫీస్ నామినేషన్ హాల్ లోకి పరుగులు తీశారు. డెడ్‌లైన్ లోగా ఆఫీసుకు వెళ్లాలన్న ఆలోచనతో మంత్రి తివారీ రన్ చేపట్టారు. బీజేపీ టికెట్‌పై ఆయన ఫేపెనా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News