Monday, December 23, 2024

అమలుకానీ హామీలతో కాంగ్రెస్ ప్రజలను మభ్యపెట్టింది

- Advertisement -
- Advertisement -

అమలుకానీ హామీలతో కాంగ్రెస్ ప్రజలను మభ్యపెట్టింది
వంద రోజుల్లో హామీలు అమలు చేయకపోతే
ప్రజల గొంతుకై పోరాటం చేస్తాం
8 మందిమి 80 మంది అవుతాం..
భవిష్యత్తులో అధికారం మాదే
అసెంబ్లీలో బిజెపి ఎంఎల్‌ఎ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం అమలుకానీ హామీలతో ప్రజలను మభ్యపెట్టిందని బిజెపి ఎంఎల్‌ఎ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు.తమ పార్టీ మాత్రం అన్ని విషయాలు ఆలోచించి అమలు సాధ్యమయ్యే హామీలనే ఇచ్చిందని పేర్కొన్నారు. బుధవారం అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల -శ్వేతపత్రంపై జరిగిన లఘు చర్చలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీలతో పాటు 412 హామీలను ఎప్పటిలోగా అమలుచేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. 100 రోజుల్లో అమలు చేయకపోతే ప్రజల గొంతుకై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో అప్పులే ఉన్నాయని శ్వేతపత్రంలో పేర్కొన్నారని.. మరీ కొత్త అప్పులు ఎలా తెస్తారు.. నిధులను ఎలా సమకూరుస్తారో సభలో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పన్నుల పేరుతో ప్రజలపై భారం మోపాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరు అదృష్టవంతులు సభలో లేరన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్న భవనంలో భట్టి నివాసం ఉంటుంన్నందుకు అదృష్టవంతుడని అంటున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో రూ.2 లక్షల రుణమాఫీ, రైతుబంధు, రూ.500 బోనస్ ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ రెవెన్యూ పెంచడానికి ప్రభుత్వ భూమి అమ్ముతారా..? కమర్షియల్ పేరుతో రుణాలు వడ్డీకి తెస్తారా? చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతిహామీని నెరవేర్చాలని, లేకుంటే ప్రజల పక్షాన పోరాటం చేస్తామన్నారు. ప్రభుత్వ ఆదాయంలో 70శాతం జీతాభత్యాలు, ఖర్చులకే సరిపోతుందని, 30శాతం నిధులతో ఎలా ఇచ్చిన హామీలు నెరవేరుస్తారన్నారు.అసెంబ్లీలో ఒక్కరు ఉన్న బిజెపి సభ్యులు 8 మందిమి అయ్యామని, 8 నుంచి 80 మందిమై భవిష్యత్తుల్లో అధికారం చేపడతామని ధీమా వ్యక్తం చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి హామీలు ఇచ్చిందని, ఎలా అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిందని, రాష్ట్రం దివాళా దిశగా పోతుందని మహేశ్వర్‌రెడ్డి అన్నారు. ఒక నియంతృత్వ పాలనలో రాష్ట్రం అప్పులపాలైందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

రైతులకు కేంద్రం ఎరువుల సబ్సిడీకి ఏటా 33 వేల కోట్లు ఇచ్చిందని, న్యాయపరంగా రావాల్సిన నిధుల కంటే తెలంగాణకు అధిక నిధులు ఇచ్చిందని వెల్లడించారు. మోటార్లకు మీటర్లు పెట్టమని కేంద్రం చెప్పిందని మాజీ మంత్రి హరీశ్‌రావు అబద్దాలు చెప్పారని, అబద్దాలతో సభను హరీశ్‌రావు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. మోటర్లకు మీటర్లు పెట్టమని కేంద్రం చెప్పినట్లు జీవో ఉందా..? అని నిలదీశారు. పదేళ్లు తప్పుడు ప్రకటనలో కాలం వెళ్లదీశారని ఆరోపించారు. హరీశ్ రావు దుష్ప్రచారం మానుకోవాలని సూచించారు. గత ప్రభుత్వం విద్య, వైద్యాన్ని విస్మరించిందని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News