Thursday, December 26, 2024

అయోధ్యలో భూముల అక్రమ విక్రయాలు!

- Advertisement -
- Advertisement -

BJP MLA Ayodhya mayor accused of illegal plotting

నిందితుల్లో బిజెపి మేయర్, ఎంఎల్‌ఎ

అయోధ్య: అయోధ్య మేయర్, బిజెపి ఎంఎల్‌ఎ, పార్టీకి చెందిన మాజీ ఎంఎల్‌ఎ సహా 40 మంది నగరంలో అక్రమంగా భూములు విక్రయించడమే కాకుండా అక్కడ నిర్మాణాలు కూడా చేపట్టినట్లు అయోధ్య అభివృద్ధి అథారిటీ ఆరోపిస్తోంది. అయితే మేయర్ రిషీకేశ్ ఉపాధ్యాయ్, ఎంఎల్‌ఎ వేద్‌ప్రకాశ్ గుప్తాలు మాత్రం తాము అమాయకులమని చెప్తూ అథారిటీ విడుదల చేసిన జాబితాలో కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు. ‘అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ ఏరియాలో 40 మంది ప్లాట్లు అమ్మడం, కొనడం చేయడంతో పాటుగా నిర్మాణాలు జరిపిన 40మంది జాబితాను అథారిటీ శనివారం రాత్రి విడుదల చేసింది’ అని అథారిటీ వైస్ చైర్మన్ విశాల్ సింగ్ ఆదివారం పిటిఐకి చెప్పారు. వీరందరిపైనా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన చెప్పారు. అయితే ఈ కేసులో తమను తప్పుగా ఇరికించారని పిటిఐతో మాట్లాడుతూ ఉపాధ్యాయ్, గుప్తాలు ఆరోపించారు. కాగా జాబితాలో బిజెపి మాజీ ఎంఎల్‌ఎ గోరఖ్‌నాథ్ బాబా పేరు కూడా ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన యుపి అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రత్యరి ్థపార్టీలు అయోధ్యలో భూముల అక్రమ కొనుగోలు, అమ్మకాల అంశాన్ని లేవనెత్తాయి.

ఈ అంశంపై ప్రత్యేక దర్యాప్తు బృందం( సిట్)తో దర్యాప్తు జరిపించాలని కోరుతూ స్థానిక ఎంపి లల్లూ సింగ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు లేఖ కూడా రాశారు. కాగా ఇప్పుడు జాబితా బహిరంగం కావడంతో దీనిపై దర్యాప్తు జరిపించాలని, దోషులను శిక్షించాలని సమాజ్‌వాది పార్టీ డిమాండ్ చేసింది. అధికారిక ట్విట్టర్‌లో లాండ్ మాఫియాతో కుమ్మక్కయి బిజెపికి చెందిన మేయర్, ఎంఎల్‌ఎ, మాజీ ఎంఎల్‌లు అయోధ్యలో అక్రమ కాలనీలను ఏర్పాటు చేస్తున్నారు. సంబంధిత శాఖలతో కుమ్మక్కయి ఇప్పటివరకు 30 అక్రమ కాలనీలను ఏర్పాటు చేశారు. దీనివల్ల రాష్ట్రానికి వందల కోట్ల ఆదాయం నష్టం జరిగింది.ఈ అంశంపై దర్యాప్తు జరిపి దోషులను శిక్షించాలి’ అని సమాజ్‌వాది పార్టీ తన అధికారిక ట్విట్టర్‌లో డిమాండ్ చేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News